జూలై 11న నథింగ్ ఫోన్ (2) గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్‌లలో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందు, కంపెనీ Nothing Phone (2) యొక్క అనేక స్పెసిఫికేషన్‌లను ధృవీకరిస్తోంది. డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉంటుందని బ్రాండ్ ఇప్పటికే ధృవీకరించింది. Nothing Phone (1) కంటే పెద్ద బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుందని తెలిసింది. ఇప్పుడు, వచ్చే నెలలో లాంచ్ ఉందనగా, తాజాగా నథింగ్ ఫోన్ (2) యొక్క ప్రీ-ఆర్డర్ వివరాలను నథింగ్ సంస్థ రివీల్ చేసింది. ఓసారి Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ప్రీ-ఆర్డర్ ఆఫర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Nothing Phone (2) ప్రీ-ఆర్డర్ ఆఫర్స్
Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ జూన్ 29 న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా మొదలు కానున్నాయి. నథింగ్ సంస్థ ప్రీ-ఆర్డర్ ఆఫర్స్ ని ప్రకటించింది. Nothing Phone (2) ని ప్రీ-ఆర్డర్ చేసుకునే కస్టమర్లకు Nothing Ear (Stick) పై 50 శాతం డిస్కౌంట్ లభించనుంది. అన్ని ప్రధాన బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవీలపై కస్టమర్లకు నథింగ్ యాక్ససరీస్ ప్యాకేజీ మరియు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పై 50 శాతం అదనపు డిస్కౌంట్ లభించనుంది. Nothing Phone (2) ని ఎలా ప్రీ-ఆర్డర్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Nothing Phone (2) ని ఎలా ప్రీ-ఆర్డర్ చేయాలి?
- జూన్ 29 న మధ్యాహ్నం 12 గంటల తర్వాత కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ లో Nothing Phone (2) ప్రీ-ఆర్డర్ పేజీకి వెళ్ళాలి.
- ఇక్కడ ఆర్డర్ కన్ఫర్మ్ చేసేందుకు రూ.2,000 రిఫండబుల్ డిపాజిట్ చేయాలి.
- రూ.2,000 చెల్లించిన తర్వాత, మరలా జులై 11 (రాత్రి 9 గంటలకు) మరియు జులై 20 (రాత్రి 11:59 గంటలకు) మధ్యలో ఫ్లిప్ కార్ట్ ని విజిట్ చేయాలి.
- ఇక్కడ మీరు మీకు కావాల్సిన వేరియంట్‌ని ఎంచుకోవాలి.
- మిగతా బ్యాలన్స్ డబ్బులు చెల్లించి, ప్రీ-ఆర్డర్ ఆఫర్స్ ని క్లెయిమ్ చేసుకోవాలి.
- సేల్ మొదలయ్యాక, Nothing Phone (2) ని సొంతం చేసుకోవచ్చు.
Nothing Phone (2) స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Nothing Phone (2) లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- చిప్సెట్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. గత మోడల్ తో పోల్చితే ఇది ఎంతో మెరుగైన అప్డేట్ అని చెప్పాలి.
- ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
- ఓఎస్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. కంపెనీ నుంచి బ్యాటరీ కెపాసిటీకి సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు.
