
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Nothing భారతీయ మార్కెట్ లో Nothing Phone (2) ధరను శాశ్వతంగా తగ్గించింది. దీంతో గతంలో కంటే ఇప్పుడు మరింత సరసమైన ధరలో Nothing Phone (2) డివైజ్ యూజర్లకు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Nothing Phone (2) తగ్గిన ధరతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Nothing Phone (2) కొత్త ధర
- Nothing Phone (2) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.44,999 ధరతో లాంచ్ అయ్యింది. 12జిబి+256జిబి మోడల్ రూ.49,999 ధరతో వచ్చింది. ఇక టాప్ మోడల్ 12జిబి+512జిబి ధర రూ.54,999 గా ఉంది.
- ఇప్పుడు Nothing Phone (2) తగ్గిన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. Nothing Phone (2) 8జిబి+128జిబి మోడల్ ధరను కంపెనీ రూ.39,999 గా నిర్ణయించింది. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.49,999 కి లభించనుంది.
- పైన తెలపబడిన ధరలు బ్యాంక్ డిస్కౌంట్స్ లేకుండానే అన్న విషయాన్ని గమనించాలి. డిస్కౌంట్స్ తో డివైజ్ ధర మరింత తగ్గుతుంది.
- Nothing Phone (2) హ్యాండ్సెట్ ఫ్లిప్‌కార్ట్ మరియు క్రోమా స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
Nothing Phone (2) స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 10 బిట్ కలర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Nothing Phone (2) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Nothing Phone (2) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Nothing Phone (2) డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.











