Home News Nothing Phone (2) గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి!

Nothing Phone (2) గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి!

Highlights
  • జులై 11 న లాంచ్ అవుతోన్న Nothing Phone (2)
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • లాంచ్‌కి ముందు రివీలైన ధర, పూర్తి స్పెసిఫికేషన్స్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. లాంచ్ కి ముందు ఈ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేస్తూ వస్తోంది. ఒక్కో ఫీచర్ ని రివీల్ చేస్తూ వస్తోన్న నథింగ్ సంస్థ, జులై 11 న లాంచ్ ఉంటుందని కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో Nothing Phone (2) కి సంబంధించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారాన్ని మీకు అందజేస్తున్నాం. మరి లాంచ్ కి ముందు ఆ వివరాలను తెలుసుకోండి.

Nothing Phone (2) డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్, టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వంటి పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపించడంతో ఫోన్ పై బజ్ క్రియేట్ అయ్యింది. లాంచ్ కోసం నథింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నథింగ్ సంస్థ జులై 11 న ఫోన్ లాంచ్ అవుతుందని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

Nothing Phone (2) విశేషాలు

టీజర్ ప్రకారం, Nothing Phone (2) అప్‌డేటెడ్ గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ తో రానుందని తెలిసింది. ఎల్ఈడీ లైట్స్ డిజైన్ కూడా మారినట్లు స్పష్టమైంది. మొత్తానికి Nothing Phone (1) కంటే Nothing Phone (2) భిన్నంగా కనిపిస్తోంది.

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. అలాగే 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, లెఫ్ట్ సైడ్ హోల్-పంచ్ కటౌట్, ఫ్లాట్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంటాయి. అప్‌గ్రేడెడ్ కెమెరా యూనిట్ ఈ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం. రా హెచ్డీఆర్, 60ఎఫ్‌పీఎస్ 4కే వీడియో ఈ ఫోన్ లో ఉండనున్నాయి. Nothing Phone (2) 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Nothing Phone (2) ధర (లీక్)

టిప్‌స్టర్ ప్రకారం, Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ధర రూ.42,000 లేదా రూ.43,000 ఉంటుందని సమాచారం. ఇది 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఇకపోతే బేస్ వేరియంట్ ధర రూ.38,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (లీక్)