Nothing సంస్థ రీసెంట్ గా Nothing Phone (2) లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ప్రీమియమ్ మిడ్ రేంజ్ ఫోన్ కేటగిరీలో వస్తోన్న ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది. ఈ ఫోన్ 2023 రెండో లేదా మూడో త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అఫీషియల్ లాంచ్ కి ముందు Nothing Phone (2) బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో Nothing Phone (2) ఇండియా లాంచ్ త్వరలోనే ఉండనుందని స్పష్టమైంది.
బీఐఎస్ పై లిస్ట్ అయిన Nothing Phone (2)
Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ‘Nothing AIN065’ అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ వెబ్ సైట్ పై కనిపించింది. అయితే, బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే, త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో లాంచ్ కానుంది.
Nothing Phone (2) కి సంబంధించిన మోడల్ నంబర్ ఒక సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించడం ఇదే తొలిసారి. అయితే లిస్ట్ లో కనిపించిన మోడల్ నంబర్ Nothing Phone (2) దే అని కచ్చితంగా పేర్కొనబడలేదు. కాబట్టి మనం స్పష్టంగా ఏమీ చెప్పలేం. కానీ, కంపెనీ యొక్క పాత పోకడను బట్టి, లిస్ట్ లో ఉన్నది Nothing Phone (2) అని చెప్పవచ్చు.
Nothing Phone (2) లాంచ్ ని ఖరారు చేసిన కంపెనీ
కొన్ని రోజుల క్రితం బార్సిలోనా లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో కంపెనీ కో-ఫౌండర్ కార్ల్ పెయి Nothing Phone (2) కి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. Nothing Phone (2) డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ సిరీస్ చిప్ తో వస్తోందని ఆయన అన్నారు. అయితే, అప్పుడు లాంచ్ తేదీకి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కార్ల్ వెల్లడించలేదు.
Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, నెట్టింట్లో అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ డివైజ్ 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే చాన్స్ ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే, ఈ డివైజ్ అమోలెడ్ ప్యానెల్ తో రానుందని అంచనా. స్క్రీన్ సైజ్ కి సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రాలేదు. అయితే లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
