స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి ర్యామ్‌తో గీక్‌బెంచ్‌పై కనిపించిన Nothing Phone (2)

Highlights

  • A065 అనే మోడల్ నంబర్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Nothing Phone (2)
  • సింగిల్-కోర్ టెస్ట్‌లో 1253, మల్టీ-కోర్‌ టెస్ట్‌లో 3833 పాయింట్లు నమోదు చేసిన డివైజ్
  • 12జిబి ర్యామ్, 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న Nothing Phone (2)

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉండనుందని ఇప్పటికే ఖరారైంది. ఫోన్ 1 కి ఇది సక్సెసర్ గా మార్కెట్ లోకి వస్తోంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో ఈ ఫోన్ రానుంది. అంటే ప్రీమియమ్ సెగ్మెంట్ లోకి నథింగ్ సంస్థ ప్రవేశిస్తోందని అర్థమవుతోంది. రానున్న కొన్ని నెలల్లో Nothing Phone (2) లాంచ్ కానుంది. ఈలోపు Nothing Phone (2) డివైజ్ గీక్ బెంచ్ పై A065 మోడల్ నంబర్ తో కనిపించింది. MySmartPrice వెబ్ సైట్ తొలుత ఈ విషయాన్ని గుర్తించింది.

Nothing Phone (2) గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Nothing Phone (2) సింగిల్ కోర్ టెస్ట్ లో 1253 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3833 పాయింట్ల స్కోరు నమోదు చేసింది.
  • మదర్‌బోర్డ్ సెక్షన్ లో taro అని పేర్కొనబడి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌కి చెందినదని భావిస్తున్నారు. ఇకపోతే ఈ చిప్ 3.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • ఈ ప్రాసెసర్ 2.5 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన 3 పెర్ఫామెన్స్ కోర్స్, 1.8 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన 4 ఎఫిషియన్సీ కోర్స్ ని కలిగి ఉంది.
  • 12జిబి ర్యామ్ తో కనిపించిన Nothing Phone (2), 8జిబి ర్యామ్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం
  • గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై కనిపించిన హ్యాండ్సెట్

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ర్యామ్, స్టోరేజీ

  • 8జిబి + 128జిబి
  • 8జిబి + 256జిబి

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 12జిబి + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఇప్పటికే బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ ని క్లియర్ చేసింది. దీన్ని బట్టి, భారత్ లో ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని అర్థమవుతోంది. ప్రస్తుతం Nothing Phone (2) గురించి పెద్దగా ఏమీ తెలియలేదు. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.