మార్కెట్ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించింది నథింగ్ సంస్థ. ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ఫోన్ ని లాంచ్ చేసి యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. Nothing Phone (1) తో సక్సెస్ అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు Nothing Phone (2) డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ జులై లో లాంచ్ కానుందిన కంపెనీ ఇదివరకే ప్రకటించింది. తాజాగా Nothing Phone (2) సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై కనిపించింది.
Nothing Phone (2) డివైజ్ భారత్ లో తయారు కానుందని కంపెనీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. “ఐకానిక్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ కి నథింగ్ స్మార్ట్ ఫోన్లు చిరునామాగా నిలుస్తున్నాయని, ఈ డిజైన్ కి హై-టెక్ మానుఫాక్చరింగ్ విధానాలు మరియు కచ్చితమైన ఇంజినీరింగ్ పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది.” అని నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను శర్మ అన్నారు.
Nothing Phone (2) లో Nothing Phone (1) కంటే మూడు రెట్లు అధికంగా రీసైకిల్డ్ లేదా బయో-బేస్డ్ కంపోనెంట్స్ ఉన్నట్లు నథింగ్ రివీల్ చేసింది. Nothing Phone (2) డివైజ్ 60 శాతం రీసైకిల్డ్ ఫైబర్ కలిగి ప్లాస్టిక్-ఫ్రీ రిటైల్ ప్యాకేజీతో వస్తోంది. సరే, ఓసారి నథింగ్ ఫోన్ 2 యొక్క టీడీఆర్ఏ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలు, అంతకు ముందు లీకైన స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
Nothing Phone (2) TDRA సర్టిఫికేషన్ లిస్టింగ్
- Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఏ065 అనే మోడల్ నంబర్ తో టీడీఆర్ఏ లిస్టింగ్ పై కనిపించింది.
- లిస్టింగ్ ద్వారా ఫోన్ మార్కెటింగ్ నేమ్ కూడా రివీల్ అయ్యింది.
- మోడల్ నంబర్ మరియు మార్కెటింగ్ నేమ్ తప్పా ఇతర స్పెసిఫికేషన్స్ ఏవీ లిస్టింగ్ పై కనిపించలేదు. అయితే గతంలోనే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ ద్వారా రివీల్ అయ్యాయి.
Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- సెక్యూరిటీ: Nothing Phone (2) లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
- ప్రాసెసర్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది.
- స్టోరేజీ, ర్యామ్: Nothing Phone (2) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ఇంకా తెలియలేదు.
- కెమెరా: Nothing Phone (2) లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.
