Home News Nothing Phone (2) ని భారత్‌లో తయారు చేయనున్నట్లు తెలిపిన కంపెనీ

Nothing Phone (2) ని భారత్‌లో తయారు చేయనున్నట్లు తెలిపిన కంపెనీ

Highlights
  • భారత్ లో జులై లో లాంచ్ కానున్న Nothing Phone (2)
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగనున్న Nothing Phone (2) అమ్మకాలు
  • స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో రానున్న Nothing Phone (2)

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ జులైలో లాంచ్ కానుంది. అయితే కంపెనీ ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈలోపు, కంపెనీ Nothing Phone (2) కి సంబంధించిన ముఖ్యమైన విషయాలను రివీల్ చేస్తూ వస్తోంది. నథింగ్ సంస్థ ఇప్పటికే, ప్రాసెసర్, బ్యాటరీ, డిస్ప్లే వివరాలను ఖరారు చేసింది. Nothing Phone (2) డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. గత మోడల్ Nothing Phone (1) స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ తో వచ్చింది.

లాంచ్ కి ముందు, Nothing Phone (2) డివైజ్ భారత్ లో తయారు కానుందని కంపెనీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. “ఐకానిక్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ కి నథింగ్ స్మార్ట్ ఫోన్లు చిరునామాగా నిలుస్తున్నాయని, ఈ డిజైన్ కి హై-టెక్ మానుఫాక్చరింగ్ విధానాలు మరియు కచ్చితమైన ఇంజినీరింగ్ పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది.” అని నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను శర్మ అన్నారు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా విభాగం

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. ఇతర సెన్సర్స్ సమాచారం ఇంకా తెలియదు.

బ్యాటరీ

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, గత మోడల్ కంటే తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్ 53.45కేజీ ని మాత్రమే కలిగి ఉంది. అంటే Nothing Phone (1) కంటే ఇది 5కేజీ తక్కువ. Nothing Phone (2) లో Nothing Phone (1) కంటే మూడు రెట్లు అధికంగా రీసైకిల్డ్ లేదా బయో-బేస్డ్ కంపోనెంట్స్ ఉన్నట్లు నథింగ్ రివీల్ చేసింది. Nothing Phone (2) డివైజ్ 60 శాతం రీసైకిల్డ్ ఫైబర్ కలిగి ప్లాస్టిక్-ఫ్రీ రిటైల్ ప్యాకేజీతో వస్తోంది.