ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing కొన్ని రోజుల క్రితం Phone (2a) ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ కొత్త ఎడిషన్ యొక్క ల్యాండింగ్ పేజీ కనిపిస్తోంది. దీంతో భారత్ లో Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ వివరాలు ముందుగానే రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Nothing Phone (2a) కొత్త ఎడిషన్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఏప్రిల్ 29న (అంటే నేడు) ఈ ఫోన్ లాంచ్ అవ్వబోతుంది. వర్చువల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. టీజర్ ద్వారా రియర్ ప్యానెల్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ ప్రత్యేకించి భారత్ కోసం డిజైన్ చేసినట్లు సమాచారం.
Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.
ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.
కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
