Nothing Phone (2a) Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • Nothing Phone (2a) Plus లాంచ్ తేదీ ఖరారు
  • జులై 31న నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ విడుదల
  • ఎక్స్‌ట్రార్డినరీ ఫోన్ గా చెబుతోన్న నథింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone (2a) Plus డివైజ్‌ను లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ ఫోన్ టీడీఆర్ఏ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. నేడు నథింగ్ సంస్థ Nothing Phone (2a) Plus యొక్క ఇండియా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జులై 31న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని నథింగ్ తెలిపింది. ఓసారి నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

Nothing Phone (2a) Plus లాంచ్ తేదీ

Nothing Phone (2a) Plus జులై 31వ తేదీన ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈమేరకు నథింగ్ సంస్థ ప్రకటన చేసింది. ఈ ఈవెంట్‌లోనే Nothing Phone (2a) Plus లాంచ్ కానుంది. జులై 31న మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదలవుతుంది. కంపెనీ విడుదల చేసిన ప్రొడక్ట్ పేజీలో ఈ ఫోన్‌ని ‘ఎక్స్‌ట్రార్డినరీ స్మార్ట్‌ఫోన్’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫోన్‌కి సంబంధించిన ఇతర వివరాలు రహస్యంగానే ఉన్నాయి. త్వరలోనే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది.

Nothing Phone 2a స్పెసిఫికేషన్స్

Nothing Phone 2a లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.

ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది. 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది.

Nothing Phone 2a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

నథింగ్ ఫోన్ 2ఏ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Previous articleOPPO Reno 12F 4G: 32ఎంపి సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన రెనో 12ఎఫ్
Next articleitel Color Pro 5G: భారత్‌లో లాంచైన ఐటెల్ కలర్ ప్రో 5జీ
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.