
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing నేడు భారతీయ మార్కెట్ లో Nothing Phone (2a) Plus అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ సరికొత్త మెటాలిక్ ఫినిష్ తో వచ్చింది. సరే, ఓసారి Nothing Phone (2a) Plus యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Nothing Phone (2a) Plus ధర, లభ్యత
Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Nothing Phone (2a) Plus యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.27,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు.
Nothing Phone (2a) Plus డివైజ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి వస్తోంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ రూ.24,999 కే లభించనుంది.
Nothing Phone (2a) Plus స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Nothing Phone (2a) Plus లో 6.7-ఇంచ్ ఫుల్హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2412*1084 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ ఫ్రీక్వెన్సీ, 10-బిట్ కలర్ డెప్త్ ఉన్నాయి.
ప్రాసెసర్: Nothing Phone (2a) Plus లో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్సెట్, మాలి-జీ610 ఎంసీ4 జీపీయూ ఉన్నాయి.
సాఫ్ట్వేర్: Nothing Phone (2a) Plus డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
మెమొరీ: Nothing Phone (2a) Plus డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
కెమెరా: Nothing Phone (2a) Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి శాంసంగ్ జీఎన్9 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ జెఎన్1 సెన్సర్ అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Nothing Phone (2a) Plus లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Nothing Phone (2a) Plus లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Nothing Phone (2a) Plus లో ఐపీ54 ప్రొటెక్షన్, స్టీరియో స్పీకర్స్, గ్లైఫ్ లైట్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Nothing Phone (2a) Plus డివైజ్ 161.7 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.











