Nothing Phone (2a): లీకైన నథింగ్ ఫోన్ (2ఏ) ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • Nothing Phone (2a) ధర 400 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Nothing Phone (2a) ని లాంచ్ చేయనుంది. కాస్త సరసమైన ధరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం. అయితే ఇప్పటి వరకు నథింగ్ సంస్థ నుంచి Nothing Phone (2a) కి సంబంధించి ఎటువంటి అధికార సమాచారం బయటకు రాలేదు. తాజాగా, Nothing Phone (2a) యొక్క కలర్ ఆప్షన్స్, ధర, స్టోరేజీ వేరియంట్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ (లీక్)

  • X ప్లాట్ఫామ్ పై టిప్‌స్టర్ రొలాండ్ క్వాండ్ట్ Nothing Phone (2a) కి సంబంధించిన సమాచారం షేర్ చేశారు.
  • పోస్ట్ ప్రకారం, Nothing Phone (2a) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Nothing Phone (2a) డివైజ్ వైట్ లేదా బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • Nothing Phone (2a) బేస్ మోడల్ ధర 400 యూరోలు (సుమారు రూ.37,000) ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Nothing Phone (2a) డిజైన్ భిన్నంగా ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ పూర్తిగా కొత్త లుక్ తో రానుందని సమాచారం. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ లో అడ్డంగా రెండు కెమెరా సెన్సర్స్ ఉండనున్నాయి.
  • Nothing Phone (2a) లో బ్యాక్ ప్యానెల్ పై కెమెరా ఐల్యాండ్ చుట్టూ గ్లైఫ్ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్స్ ఉంటాయి.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Nothing Phone (2a) లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కేజీఎన్9 ప్రైమరీ కెమెరా, శాంసంగ్ యొక్క 50ఎంపి ఐసోసెల్ జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది. Nothing Phone (2a) లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.

Nothing Phone (2a) లాంచ్ తేదీ (అంచనా)

  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 27 న బార్సిలోనాలో జరిగే MWC 2024 లో ‘నథింగ్ టు సీ’ ఈవెంట్ ద్వారా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • Nothing Phone (2a) డివైజ్ కి ప్యాక్‌మ్యాన్ అనే కోడ్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ భారత్, యూరప్, జపాన్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది.
Previous articleపెరిస్కోప్ కెమెరా ఫోన్‌ని టీజ్ చేసిన Realme India
Next articleలీకైన OPPO Reno 11, Reno 11 Pro ఇండియా లాంచ్ తేదీ
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.