TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Nothing Phone (2a)

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • టీడీఆర్ఏ సర్టిఫికేషన్‌పై లిస్టైన డివైజ్
  • నథింగ్ ఫోన్‌ని టీజ్ చేసిన కార్ల్ పే

కార్ల్ పే సారథ్యంలో ఏర్పడిన Nothing సంస్థ ఇప్పటి వరకు రెండు స్మార్ట్‌ఫోన్లను భారత్ తో సహా గ్లోబల్ గా లాంచ్ చేసింది. అవి: Nothing Phone (1), Nothing Phone (2). ఈసారి వీటికంటే కాస్త తక్కువ ధరలో మరొక ఫోన్ ని నథింగ్ సంస్థ తీసుకురాబోతోంది. Nothing Phone (2a) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇటీవలె నథింగ్ సీఈవో కార్ల్ పే ఓ డివైజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది Nothing Phone (2a) అయ్యుంటుందని అంతా విశ్వసిస్తున్నారు. మరోవైపు, Nothing Phone (2a) డివైజ్ యూఏఈ కి చెందిన టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) TDRA సర్టిఫికేషన్ వివరాలు

  • Nothing Phone (2a) యూఏఈకి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ లో Nothing Phone (2a) పేరు పేర్కొనబడి ఉంది. పేరు తప్పా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
  • కార్ల్ పే షేర్ చేసిన టీజర్ ద్వారా ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. కంపెనీ ఇంకా ఈ ఫోన్ డీటెయిల్స్ రహస్యంగానే ఉంచుతోంది.
  • రానున్న రోజుల్లో Nothing Phone (2a) కి సంబంధించి కంపెనీ నుంచి మరిన్ని టీజర్స్ వచ్చే అవకాశం ఉంది. సరే, ఓసారి Nothing Phone (2a) యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కేజీఎన్9 ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఐసోసెల్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ లేదా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
Previous articleలీకైన Moto G34 5G ఇండియా లాంచ్ తేదీ
Next article90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 8
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.