హైలైట్స్
- Okaya Freedum ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత్ లో లాంచ్ చేసిన Okaya Power
- సింగిల్ చార్జ్ పై 70 నుంచి 75 కిలోమీటర్ల దూరం పరిగెట్టనున్న Okaya Freedum
- డీలర్షిప్స్ మరియు ఆన్లైన్ ద్వారా ఇంకా అమెజాన్ వెబ్సైట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉండనున్న Okaya Freedum
భారతీయ ఎనర్జీ కంపెనీ Okaya Power ఇండియాలో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya Freedum ని లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్ లో లాంచ్ అయిన Okaya Faast-F4, Okaya Classiq ఎలక్ట్రిక్ స్కూటర్ల సరసన Okaya Freedum జత చేరింది. Okaya Freedum బండి కంపెనీ యొక్క హిమాచల్ ప్రదేశ్ ప్లాంట్ లో అసెంబుల్ అవుతోంది. ఈ బండి విభిన్న వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ లో లభ్యం కానుంది.
Okaya Freedum సింగిల్ చార్జ్ పై 70 నుంచి 75 కిలోమీటర్ల దూరం పరిగెట్టగలదు. ఇక బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.
భారత్ లో Okaya Freedum ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, లభ్యత
Okaya Freedum భారత్ లో రూ.74,899 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయ్యింది. రిజిస్ట్రేషన్ మరియు ట్యాక్స్ వివిధ రాష్ట్రాలకు ఒక్కో విధంగా ఉంటాయి. Okaya Freedum బండి 3 ఏళ్ళ బ్యాటరీ వ్యారంటీతో వస్తోంది. పెర్ల్ వైట్, సింఫనీ సిల్వర్, యాష్ గ్రే, ఫైరీ రెడ్, ట్యాంటలైజింగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్, మిలిటరీ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ బండి లభిస్తుంది.
Okaya Freedum ఎలక్ట్రిక్ స్కూటర్ ని అమెజాన్ ద్వారా మరియు కంపెనీ యొక్క అధికార వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
Okaya Freedum స్పెసిఫికేషన్స్
Okaya Freedum 250 వాట్ బ్రష్‌లెస్ డీసీ మోటర్ పై పని చేస్తుంది. ఈ బండిలో 48వోల్ట్స్ 30 ఆంపియర్ ఎల్ఎఫ్‌పి బ్యాటరీ ఉంటుంది. సంప్రదాయ లిథియమ్ అయాన్ బ్యాటరీల కంటే ఎల్ఎఫ్‌పి బ్యాటరీలు ఎంతో సురక్షితం. ఇవి మంటలంటుకోవడం చాలా తక్కువ. అయితే ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ ద్వారా స్కూటర్ 25 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ లో వెళ్ళగలదు. దీన్ని అన్‌లాక్ చేసి వేగాన్ని 35 కేఎంపీహెచ్ కి పెంచుకోవచ్చని కంపెనీ చెబుతోంది. Okaya Freedum ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 70 నుంచి 75 కిలోమీటర్ల దూరం వెళ్తుంది.
Okaya Freedum ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిజిటల్ ఎంఐడీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, టెలీస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, అండర్-సీట్ స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ లో ఇకో రైడింగ్ మోడ్ ఉంది. వాక్ అసిస్టెంట్, మోటర్ లాక్ ఫీచర్లు కూడా ఈ బండిలో ఉన్నాయి. ధర మరియు సేఫ్టీ పరంగా ఒకాయ ఫ్రీడమ్ స్కూటర్ బాగుందనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో చిక్కుకుంటోన్న తరుణంలో ఈ స్కూటర్ అటువంటి ఉదంతాలను తగ్గిస్తుందేమో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.