హైలైట్స్
- ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్
- 10 స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్న ఓలా ఎలక్ట్రిక్, రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా రూ.4500 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం
- డ్రా ద్వారా ఎంపికైన వారికి స్కూటర్లు గెలుచుకునే అవకాశం
Ola Electric పలు ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్స్ కస్టమర్లకు లభించనున్నాయి. కొత్త ఆఫర్లను చూస్తే, జీరో డౌన్ పేమెంట్, లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓలా ఫాస్ట్ చార్జర్ నెట్వర్క్ కి ఉచిత యాక్సెస్, ఏడాది పాటు ఉచిత సర్వీసింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభించనుంది. డ్రా లో భాగంగా 10 ఎలక్ట్రిక్ స్కూటర్లను గెలుచుకోవచ్చు. ఇందుకోసం మీరు మీకు సమీపంలోని ఓలా అథరైజ్డ్ షోరూమ్స్ లో టెస్ట్ రైడ్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంకా రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీని ద్వారా కస్టమర్లు రూ.4,500 క్యాష్‌బ్యాక్ పొందుతారు. వారు చేయల్సిందల్లా Ola S1 లేదా Ola S1 Pro వాహనాలను మరొక ముగ్గురికి రిఫర్ చేయడమే. దీంతో రూ.4500 క్యాష్ బ్యాక్ మీ సొంతం అవుతుంది.
ఈ ఏడాది చివరి వరకు ఆఫర్లు చెల్లుబాటు అవుతాయి. అంతే 2022 డిసెంబర్ 31 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. రీసెంట్ గా లాంచ్ అయిన Ola S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ కి కూడా ఈ ఆఫర్స్ వర్తిస్తాయా లేదా అన్నది ఇంకా తెలియదు. కంపెనీ నుంచి కూడా ఎటువంటి ప్రకటన లేదు.
Ola S1 Pro, Ola S1 Pro లపై ఇయర్-ఎండ్ ఆఫర్స్
ఓలా ఎలక్ట్రిక్ రూ.3,499 విలువగల పూర్తి ఉచిత సర్వీస్ ని ఏడాది పాటు Ola S1, Ola S1 Pro స్కూటర్లపై అందిస్తోంది. ఓలా ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. 2022 సెప్టెంబర్ లో పరిచయం చేసిన రూ.10,000 డిస్కౌంట్ ఆఫర్ ని ఇంకొన్ని రోజులపాటు కొనసాగించాలని ఓలా భావిస్తోంది. అలాగే Ola S1 Pro పై తగ్గించిన ధర 2022 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.
భారత్ లో ప్రస్తుతం Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.1,29,000 గా ఉంది. Ola S1, Ola S1 Pro లపై ఓలా ఎలక్ట్రిక్ జీరో డౌన్‌పేమెంట్ మరియు జీరో ప్రాసెసింగ్ ఫీ స్కీమ్ ని ఆఫర్ చేస్తోంది. తగ్గించిన వడ్డీ రేట్ల మూలంగా ఈఎంఐ కూడా రూ.2,499 కి తగ్గిపోనుంది. మీరు గనుక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తుంటే, ఓసారి ఓలా ఎలక్ట్రిక్ తన వాహనశ్రేణిపై అందిస్తోన్న వివిధ ఆఫర్లను చెక్ చేయండి. అలాగే ఓలా అందిస్తోన్న ఫీచర్లను కూడా ఇతర ఎలక్ట్రిక్ బండ్లతో పోల్చి చూసి సరైన దాన్ని ఎంపిక చేసుకోండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.