Home News భారత్‌లో ఔట్ ఆఫ్ ద వరల్డ్, పెర్ఫామాక్స్, రేంజర్ అనే ఈ-బైక్స్‌ని లాంచ్ చేయనున్న ఓలా?

భారత్‌లో ఔట్ ఆఫ్ ద వరల్డ్, పెర్ఫామాక్స్, రేంజర్ అనే ఈ-బైక్స్‌ని లాంచ్ చేయనున్న ఓలా?

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Ola ఎలక్ట్రిక్ బైక్స్
  • ఓలా బైక్స్ పేర్లు: Ola Out of the world, Ola Performax, Ola Ranger
  • అత్యధిక రేంజ్ తో వస్తోన్న Ola ‘Out Of The World’, ధర: రూ.1,50,000 గా ఉండే అవకాశం

భారత్ లోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల్లో Ola ఒకటి. ప్రస్తుతం భారత మార్కెట్ లో Ola ఈ-స్కూటర్లకు భారీ డిమాండ్ ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ 91మొబైల్స్ తో షేర్ చేసిన దాని ప్రకారం, ఓలా ఈ-బైక్స్ వివిధ ధరల శ్రేణుల్లో, విభిన్న స్పెసిఫికేషన్స్, మోడల్స్ లో లభ్యం కానున్నాయని తెలుస్తోంది. ఓలా తీసుకురానున్న బైక్స్ పేర్లు ఈ విధంగా ఉండనున్నాయి. Ola ‘Out of the World’, ‘Performax’, ‘Ranger’.

Ola ఔట్ ఆఫ్ ద వరల్డ్ ఈ మూడు బండ్లలో అత్యంత ఖరీదైన, ప్రీమియమ్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ బండి టాప్ స్పీడ్ 100 కేఎంపీహెచ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు రూ.85,000 లతో ప్రారంభమవుతాయి. ఇప్పటికి తెలిసిన కాస్త సమాచారంతో పూర్తిగా ఏదీ అంచనా వేయలేం. అసలు ధరలు, స్పెసిఫికేషన్స్ వేరుగా ఉండే అవకాశం ఉంది. సరే ఓసారి, ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ అంచనా ధరలు, తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ స్పెసిఫికేషన్స్, ధర (లీక్డ్)

Ola ఔట్ ఆఫ్ ద వరల్డ్ బైక్ సింగిల్ చార్జ్ పై 174 కిలోమీటర్ల దూరం పరుగెడుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 110 కేఎంపీహెచ్ గరిష్ట వేగం వెళ్తుంది. ఇది ఒకే వేరియంట్ లో వస్తోంది. ఈ బైక్ ధర రూ.1,50,000 గా ఉంది. ఈ బైక్ ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ తో వస్తోంది. ఇది సేఫ్ అండ్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇప్పుడు Ola Performax గురించి తెలుసుకుందాం. ఇదొక మిడ్ రేంజ్ ఆఫరింగ్. మొత్తం 3 వేరియంట్స్ లో లభిస్తుంది. ఎంట్రీ లెవెల్ వేరియంట్ 91 కిలోమీటర్ల రేంజ్, 93 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.1,05,000 గా ఉంటుంది.

ఇక సెకండ్ వేరియంట్ విషయానికి వస్తే, ఈ బండి ధర రూ.1,15,000 గా ఉంటుంది. టాప్/ప్రీమియమ్ Ola Performax వేరియంట్ ధర రూ.1,25,000 గా ఉంటుంది. 174 కిలోమీటర్ల రేంజ్, 95 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ఉంటుంది. ఓలా పెర్ఫామెక్స్ బైక్ పెర్ఫామెన్స్-సెంట్రిక్ బైక్ అని చెప్పవచ్చు.

Ola Ranger ఎలక్ట్రిక్ బైక్ తక్కువ ధరలో కస్టమర్ కి లభించనుంది. దీని ధర రూ.85,000 లతో ప్రారంభమై, రూ.1,05,000 వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎఫిషయంట్ పెర్ఫామెన్స్ ని అందిస్తుంది. మూడు వేరియంట్స్ లో ఈ బండి లభిస్తుంది. 80 కిలోమీటర్ల రేంజ్, 91కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ని ఈ బైక్ కలిగి ఉంటుంది. ఇక మిడ్ వేరియంట్ ధర రూ.95,000 గా ఉంటుంది. ఇది 117 కేఎం రేంజ్, 91 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ కలిగి ఉంటుంది. ప్రీమియమ్ వేరియంట్ 153 కేఎం రేంజ్, 91 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ కలిగి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.