హైలైట్స్
- భారత్ లో OnePlus 10 Pro ధర తగ్గింపు, అధికార వెబ్సైట్, ఈ-కామర్స్ సైట్స్ లో దర్శనమిస్తోన్న కొత్త ధర
- తగ్గింపు తర్వాత 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.61,999. 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.66,999
- 6.7-ఇంచ్ 2కే ఫ్లూయిడ్ అమోలెడ్ ఎల్టీపీవో 2.0 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
OnePlus 9 Pro కి సక్సెసర్ గా వచ్చిన OnePlus 10 Pro 2022 మార్చిలో భారత్ లో లాంచ్ అయ్యింది. 8జిబి + 128జిబి ధర రూ.66,999 ఉండగా, 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.71,999 గా ఉంది. ఇప్పుడు వన్‌ప్లస్ ఈ రెండు వేరియంట్స్ పై ధర ను తగ్గించింది. తగ్గించిన ధర వన్ ప్లస్ అధికార వెబ్ సైట్ తో పాటు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా దర్శనమిస్తోంది. ఓసారి తగ్గిన ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
OnePlus 10 Pro ధర, లభ్యత
OnePlus 10 Pro పై రూ.5,000 తగ్గింది. తగ్గిన తర్వాత OnePlus 10 Pro 8జిబి + 128జిబి వేరియంట్ రూ.61,999 కి లభిస్తుండగా, 12జిబి + 256జిబి యూనిట్ ధర రూ.66,999 కి లభిస్తోంది. OnePlus 10 Pro స్మార్ట్ ఫోన్ ని వన్‌ప్లస్ అధికార వెబ్ సైట్ తో పాటు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొనవచ్చు. వొల్కానిక్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తోంది.
అలాగే వన్ ప్లస్ కంపెనీ Buds Z2, Buds Pro పై డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఇవి వరుసగా రూ.2,229 మరియు రూ.5,499 కి లభిస్తున్నాయి. Buds Z2 లాంచ్ ధర రూ.4,999 కాగా, Buds Pro లాంచ్ ప్రైస్ రూ.9,990. అంతేకాదండోయ్, OnePlus తన కస్టమర్ల కోసం ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా తీసుకొచ్చింది. పాత డివైజ్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 9 నెలల కాలపరిమితితో వడ్డీలేని ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
OnePlus 10 Pro స్పెసిఫికేషన్స్
OnePlus 10 Pro లో 6.7-ఇంచ్ 2కే డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అమర్చారు. OnePlus 10 Pro ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OnePlus 10 Pro 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి వేరియంట్స్ లో లభించనుంది. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ OnePlus 10 Pro లో ఉన్నాయి.
OnePlus 10 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ని అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.