Home News గీక్‌బెంచ్ పై కనిపించిన OnePlus 10RT

గీక్‌బెంచ్ పై కనిపించిన OnePlus 10RT

హైలైట్స్:

వన్ ప్లస్ నుంచి త్వరలో వన్ ప్లస్ 10టీ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే దీంతో పాటు వన్ ప్లస్ 10ఆర్‌టీ అనే మరొక ఫోన్ కూడా త్వరలోనే లాంచ్ అవ్వనున్నట్లు సమచారాం. గీక్‌బెంచ్ వెబ్‌సైట్ లో ఈ ఫోన్ సీపీహెచ్2413 అనే మోడల్ నంబర్ తో దర్శనమిచ్చింది. ఇది వరకు ఇదే ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్స్ లో కూడా కనిపించింది. భారత్ లో ఈ ఫోన్ ఇంటర్నల్ టెస్టింగ్ మొదలైనట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. వన్ ప్లస్ 10ఆర్‌టీ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు గీక్‌బెంచ్ వెబ్ సైట్ లిస్టింగ్ ద్వారా స్పష్టమవుతోంది. వన్ ప్లస్ 10టీ భారత గడ్డపై అడుగు పెట్టాక, వన్ ప్లస్ 10ఆర్‌టీ లాంచ్ అయ్యే అవకాశముంది. మరి వన్ ప్లస్ 10ఆర్‌టీ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

OnePlus 10RT గీక్‌బెంచ్ లిస్టింగ్

మై‌స్మార్ట్‌ప్రైస్ వన్‌ప్లస్ 10ఆర్‌టీ గీక్‌బెంచ్ లిస్టింగ్ ను బయటకు తీసుకొచ్చింది. గీక్‌బెంచ్ పై సీపీహెచ్2413 అనే కోడ్ నంబర్ తో ఉన్న వన్‌ప్లస్ 10ఆర్‌టీ సింగిల్-కోర్ టెస్ట్ లో 828 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,414 పాయింట్లు సాధించింది. వన్ ప్లస్ 10ఆర్‌టీ 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్ ని ఈ ఫోన్లో వాడారు. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను ఈ ఫోన్లో అమర్చే అవకాశముంది.

OnePlus 10RT స్పెసిఫికేషన్స్

ఇంతకు ముందు అనుకున్నట్లుగా, వన్ ప్లస్ 10ఆర్‌టీ అమోలెడ్ ప్యానెల్ తో రానుంది. అలాగే ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండనుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి. ఇక ఈ ఫోన్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ 10ఆర్‌టీ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సెకండరీ షూటర్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉండే అవకాశముంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16ఎంపి కెమెరా ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేయనుంది.

వన్ ప్లస్ 10టీ భారత గడ్డపై అడుగు పెట్టాక, వన్ ప్లస్ 10ఆర్‌టీ లాంచ్ అయ్యే అవకాశముంది.