Home News త్వరలో లాంచ్ కానున్న OnePlus 10T Marvel ఎడిషన్

త్వరలో లాంచ్ కానున్న OnePlus 10T Marvel ఎడిషన్

హైలైట్స్

ఆగస్టు నెలలో OnePlus 10T స్మార్ట్ ఫోన్ లాంచైంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వచ్చింది. మార్వెల్ స్టూడియోస్ తో కలిసి ఇప్పుడు వన్ ప్లస్ OnePlus 10T మార్వెల్ ఎడిషన్ ని తీసుకురానుంది. లాంచ్ కి ముందు స్పెషల్ ఎడిషన్ కి సంబంధించిన ప్రకటన చేసింది వన్ ప్లస్. Black Panther: Wakanda Forever సినిమా రిలీజ్ నేపథ్యంలో స్పెషల్ ఎడిషన్ ని తీసుకొచ్చింది వన్ ప్లస్.

వన్ ప్లస్ మరియు మార్వెల్ స్టూడియోస్ ది ఇదే మొదటి కొలాబరేషన్ కాదు. ఇదివరకు 2018 లో వన్ ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ అనే స్పెషల్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఈ ఎడిషన్ Avengers: Infinity War సినిమా విడుదల సమయంలో వచ్చింది. ఇకపోతే OnePlus 10T మార్వెల్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ కి ముందు షాప్‌డిస్నీ.ఇన్ వెబ్ సైట్ లో OnePlus 10T మార్వెల్ ఎడిషన్ బాక్స్ దర్శనమిచ్చింది. వన్ ప్లస్ నుంచి OnePlus 10T మార్వెల్ ఎడిషన్ కి సంబంధించిన సోషల్ మీడియా ప్రకటనను ఇక్కడ చూడండి.

OnePlus 10T Marvel Edition లో కొత్తగా ఏముంటాయి?

OnePlus 10T మార్వెల్ ఎడిషన్ మూన్‌స్టోన్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. రిటైల్ బాక్స్ లో కంపెనీ మూడు ఎక్స్‌క్లూజివ్ గూడీస్ ని ఇస్తుంది. అవి: ఐరన్ మ్యాన్ ఫోన్ కవర్, కెప్టెన్ అమెరికా పాప్-సాకెట్, బ్లాక్ పాంథర్ ఫోన్ స్టాండ్.

భారత్ లో OnePlus 10T మార్వెల్ ఎడిషన్ ధర

OnePlus 10T మార్వెల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర డిస్నీ షాప్ లో రూ.55,999 గా ఉంది.

OnePlus 10T మార్వెల్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus 10T స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 4ఎన్ఎం చిప్సెట్, ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

OnePlus 10T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 150 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus 10T స్మార్ట్ ఫోన్ 8.75 మిల్లీ మీటర్ల మందం, 203.5 గ్రాముల బరువు ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్ OnePlus 10T లో ఉంటాయి. వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లు ఈ ఫోన్ లో లేవు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.