
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 పై మంచి డీల్ యూజర్లను ఊరిస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ అనుభూతి పొందాలనుకునే వారికి ఈ ఆఫర్ సరైనదని చెప్పవచ్చు. ఏకంగా రూ.23,000 తక్కువకి ఈ ఫోన్ విక్రయించబడుతోంది. ప్రస్తుం షాపింగ్ సైట్ అమెజాన్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఓసారి వన్‌ప్లస్ 11 యొక్క కొత్త ధర మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
OnePlus 11 5G ఆఫర్ వివరాలు
OnePlus 11 5G 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ అమెజాన్ పై కేవలం రూ.38,999 కే విక్రయించబడుతోంది.
వన్‌ప్లస్ ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.23,000 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ఈ ఫోన్ ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ పై అందుబాటులో లేదు.
రూ.23,000 భారీ డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా యూజర్లకు లభిస్తోంది.
మీ పాత ఫోన్ మార్చుకుని రూ.31,500 వరకు బోనస్ పొందవచ్చు. మీ ఫోన్ కండీషన్ పై ఈ బోనస్ విలువ ఆధారపడి ఉంటుంది.
- OnePlus 11 5G యొక్క పాత ధర రూ.61,999 గా ఉంది.
- OnePlus 11 5G యొక్క డిస్కౌంట్ ధర రూ.38,999 గా ఉంది. ఆఫర్లను చూసేందుకు, ఇక్కడ క్లిక్ చేసి అమెజాన్ సైట్ కు వెళ్ళండి.
OnePlus 11 5G కొనవచ్చా?
2023 లో రూ.61,999 ధరతో లాంచ్ అయిన OnePlus 11 5G ని ప్రస్తుతం రూ.38,999 కి కొనడం లాభమేనని చెప్పవచ్చు. మీకు ఈ ఫోన్ లో 16జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ లభిస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంది. అలాగే 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.
OnePlus 11 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OnePlus 11 5G లో 6.7-ఇంచ్ క్వాడ్‌హెచ్డీ+ సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ స్క్రీన్, 20.1:9 యాస్పెక్ట్ రేషియో, 3216*1440 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
ప్రాసెసర్: OnePlus 11 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.2 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: OnePlus 11 5G స్మార్ట్‌ఫోన్‌లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని అందించారు.
కెమెరా: OnePlus 11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి సోని ఐఎంఎక్స్471 ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: OnePlus 11 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: OnePlus 11 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.












