స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌, 16జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11 5G

Highlights

  • భారత్ లో లాంచైన వన్‌ప్లస్ బ్రాండ్ ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 5G
  • 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ ఈ4 ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 వాట్ చార్జింగ్ తో వచ్చిన OnePlus 11 5G
  • భారత్ లో OnePlus 11 5G ధర రూ.56,999 నుంచి ప్రారంభం

OnePlus లవర్స్ ఎదురు చూస్తోన్న సమయం వచ్చేసింది. నేడు భారత్ లో వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ సిరీస్ OnePlus 11 5G లాంచ్ అయ్యింది. OnePlus 11 5G తో పాటు OnePlus 11R 5G కూడా మార్కెట్ లోకి వచ్చింది. వన్ ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కి భారత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఫోన్స్ స్థాయిలో వన్ ప్లస్ డివైజెస్ కి భారీ డిమాండ్ ఉంది. తాజాగా లాంచైన ఫ్లాగ్షిప్ సిరీస్ తో వన్ ప్లస్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి. ఇక OnePlus 11 5G స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 16జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి వచ్చింది.

OnePlus 11 5G డిజైన్, చిప్సెట్

వన్ ప్లస్ 11 5జీ యూనిబాడీ డిజైన్, కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది. టైటాన్ బ్లాక్, ఎటర్నల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

OnePlus 11 5G క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది. 16gb ఎల్పీడీడీఆర్5ఎక్స్ వరకు ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో ఈ ఫోన్ ఎక్విప్ అయ్యింది. 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. డ్యూయల్ వైఫై యాక్సలరేషన్, వై-ఫై 7 కనెక్టివిటీతో వన్ ప్లస్ 11 5జీ వచ్చింది.

OnePlus 11 5G స్పెసిఫికేషన్స్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
  • 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే అమోలెడ్ డిస్ప్లే
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ
  • 50ఎంపి + 48ఎంపి + 32ఎంపి రియర్ కెమెరా
  • 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus 11 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉన్నాయి. వన్‌ప్లస్ కెమెరా విభాగం కోసం హేజల్‌బ్లడ్ తో కలిసి పని చేసింది.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100  వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో వై-ఫై 7, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

OnePlus 11 5G ధర, లభ్యత

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి యూఎఫ్ఎస్3.1 ధర రూ.56,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ వేరియంట్ ధర రూ.61,999 గా ఉంది. నేడు రాత్రి 9 గంటల నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయి. ఫిబ్రవరి 14 నుంచి ఓపెన్ సేల్ మొదలవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలాంచ్ కి ముందు లీకైన Vivo Y100 5G లైవ్ ఇమేజ్
Next articleSnapdragon 8+ Gen 1 చిప్, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11R
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.