గతవారం జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2, వన్‌ప్లస్ 11ఆర్ ని భారత్ లో లాంచ్ చేసింది. వీటి నుంచి నేడు OnePlus 11 మరియు OnePlus Buds Pro 2 సేల్ కి వచ్చాయి. OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది.
భారత్ లో OnePlus 11, OnePlus Buds Pro 2 ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత
OnePlus 11 హ్యాండ్సెట్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.56,999 గా ఉంది. 16జిబి + 256జిబి యూనిట్ ధర రూ.61,999 గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా వన్‌ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ కార్డ్ (ఈఎంఐ) లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.
నేడు అనగా ఫిబ్రవరి 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ స్టోర్ ద్వారా OnePlus 11 సేల్ మొదలవుతుంది.
భారత్ లో OnePlus Buds Pro 2 ధరను రూ.11,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా వన్‌ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ కార్డ్ (ఈఎంఐ) లావాదేవీలపై రూ.500 డిస్కౌంట్ అందిస్తోంది. నేడు అనగా ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు వన్‌ప్లస్ స్టోర్ ద్వారా OnePlus Buds Pro 2 ని కొనుగోలు చేయవచ్చు.
OnePlus 11 స్పెసిఫికేషన్స్
OnePlus 11 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉన్నాయి. వన్‌ప్లస్ కెమెరా విభాగం కోసం హేజల్‌బ్లడ్ తో కలిసి పని చేసింది.
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో వై-ఫై 7, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
