హైలైట్స్
- రివీల్ అయిన OnePlus 11 ర్యామ్ మరియు స్టోరేజీ స్పెసిఫికేషన్స్
- చైనాలో జనవరి 4 న లాంచ్ అవుతోన్న OnePlus 11
- ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవ్వనున్న OnePlus 11
వన్‌ప్లస్ 11 చైనాలో గ్లోబల్ మార్కెట్స్ కంటే ఒక నెల రోజుల ముందుగానే లాంచ్ కానుందని తాజాగా కంపెనీ ప్రకటించింది. జనవరి 4 న చైనాలో OnePlus 11 లాంచ్ అవుతుందని తన ప్రకటనలో పేర్కొంది. ఇక భారత్ తో పాటు, గ్లోబల్ గా OnePlus 11 ఫిబ్రవరి 7 న లాంచ్ అవ్వబోతోంది. OnePlus 11 తో పాటు ఇంకా OnePlus Buds Pro 2 TWS కూడా లాంచ్ కానుంది.
OnePlus 11 యొక్క ర్యామ్, స్టోరేజీ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. LPPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజీ టెక్నాలజీతో OnePlus 11 వస్తోంది. OnePlus 11 డివైజ్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుందని సమాచారం. OnePlus 11 యొక్క లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.
OnePlus 11 చైనా లాంచ్ తేదీ ఖరారు
పైన ప్రమోషనల్ పోస్టర్ లో కనిపిస్తోన్న విధంగా, OnePlus 11 చైనాలో జనవరి 4 న లాంచ్ అవుతోంది. పోస్టర్ లో డివైజ్ రెండు కలర్ వేరియంట్స్ లో వస్తుందని స్పష్టమవుతోంది. అలాగే OnePlus 11 ఫోన్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ తో రానున్నట్లు సమాచారం. అయితే 8జిబి వేరియంట్ ఉండబోదు. OnePlus 11 ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ తో స్టార్ట్ అవుతుంది.
OnePlus 11 స్పెసిఫికేషన్స్ (అంచనా)
OnePlus 11 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ లో క్వాల్కమ్ యొక్క పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ని వాడారు. అలాగే ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.
OnePlus 11 కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. OnePlus 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
OnePlus 11 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో ఆక్సిజన్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో అందుబాటులో ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం OnePlus 11 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 5జీ, 4జీ వొల్టీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












