Active CryoFlux కూలింగ్ టెక్నాలజీతో కూడిన OnePlus 11 Concept ఫోన్‌ని పరిచయం చేసిన OnePlus

Highlights

  • బ్రాండ్-న్యూ కూలింగ్ టెక్నాలజీతో వచ్చిన OnePlus 11 కాన్సెప్ట్ ఫోన్
  • Active CryoFlux కూలింగ్ టెక్నాలజీ వల్లన 2.1 డిగ్రీ సెల్సియస్ కి తగ్గనున్న ఫోన్ టెంపరేచర్
  • యాక్టివ్ క్రయోఫ్లక్స్ కూలింగ్ టెక్నాలజీ ఇన్‌స్పైర్డ్ యూనిక్ డిజైన్ తో వచ్చిన OnePlus 11

MWC 2023 ఈవెంట్ లో OnePlus సంస్థ OnePlus 11 కాన్సెప్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ కాన్సెప్ట్ ఫోన్ ద్వారా Active CryoFlux కూలింగ్ టెక్నాలజీని వన్ ప్లస్ పరిచయం చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ టెంపరేచర్ 2.1 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గుతుంది. అయితే ఈ కాన్సెప్ట్ ఫోన్ ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉండదు. కానీ, భవిష్యత్తులో విడుదలయ్యే ఫోన్లలో ఈ టెక్నాలజీని వాడబోతున్నారు.

OnePlus 11 ద్వారా వన్ ప్లస్ సంస్థ ఇన్-బిల్ట్ ఏఆర్ మరియు రే ట్రేసింగ్ కేపబులిటీ వంటివి ఎలా పని చేస్తాయో ప్రదర్శించింది. తాజాగా తీసుకొచ్చిన టెక్నాలజీల కోసం వన్ ప్లస్ సంస్థ క్వాల్కమ్ మరియు పర్ఫెక్ట్ వరల్డ్ గేమ్స్ తో జట్టుకట్టింది. సరే, ఓసారి OnePlus 11 కాన్సెప్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 11 కాన్సెప్ట్ ఫోన్ – Active CryoFlux కూలింగ్ టెక్నాలజీ

పైన చెప్పిన విధంగా, Active CryoFlux కూలింగ్ టెక్నాలజీ ఫోన్ యొక్క టెంపరేచర్ ని 2.1 డిగ్రీ సెల్సియస్ కి తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు, గేమ్ ప్లే సెషన్స్ లో ఫ్రేమ్ రేట్ 3-4 ఎఫ్‌పీఎస్ వరకు ఇంప్రూవ్ అవుతుంది. మరీ ముఖ్యంగా యాక్టివ్ క్రయోఫ్లక్స్ ఫోన్ టెంపరేచర్ ని 1.6 డిగ్రీలకు తగ్గిస్తుంది.

పరిమితులను చెరిపేయాలన్న లక్ష్యంతో వన్‌ప్లస్ సంస్థ పీసీ ల్లోని ఇండస్ట్రీ-గ్రేడ్ కూలింగ్ కేపబులిటీని స్మార్ట్ ఫోన్ లోకి తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ గ్రేడ్ సిరామిక్ పైజోఎలక్ట్రిక్ మైక్రోపంప్స్ ఆధారంగా ఈ యాక్టివ్ క్రయోఫ్లక్స్ ఫంక్షన్స్ పని చేస్తాయి. మైక్రోపంప్ 0.2cm2 ని కవర్ చేస్తూ, లిక్విడ్ ని పైప్‌లైన్స్ చుట్టూ సర్క్యులేట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

OnePlus 11 కాన్సెప్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ కూడా Active CryoFlux టెక్నాలజీ స్పూర్తితో రూపొందించారు. రియర్ కవర్ పై మైక్రో లిక్విడ్ పైప్‌లైన్స్ ద్వారా ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది మ్యాగ్నెట్రాన్-స్ప్లట్టరింగ్ కోటింగ్ తో ఈ డిజైన్ పూర్తవుతుంది. కెమెరా లెన్స్ పై కూడా ఇటువంటి డిజైన్ నే అనుసరించారు.

OnePlus 11 కాన్సెప్ట్ ఫోన్ గ్లాస్ యూనిబాడీ డిజైన్, డీప్లీ కర్వ్డ్ ప్యానెల్, సన్నని బెజెల్స్ తో వచ్చింది.

OnePlus 11 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కలిగి ఉండి, హార్డ్‌వేర్-యాక్సలరేటెడ్ రే ట్రేసింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే రియల్ టైమ్ లైట్ ఎఫెక్ట్స్ కి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేసే సిరీస్ ఏదైనా ఉందంటే అది Samsung Galaxy S23 సిరీస్ మాత్రమే. వన్ ప్లస్ సంస్థ తాము పర్ఫెక్ట్ వరల్డ్ గేమ్స్ తో జట్టుకట్టినట్లు అనౌన్స్ చేసింది.

OnePlus 11 ఫోన్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి స్నాప్ డ్రాగన్ స్పేసెస్-రెడీ ఫోన్. Snapdragon Spaces అనేది XR డెవలపర్ ప్రొగ్రామ్. ఇది XR ఐడియాలకు జీవం పోసేందుకు మరియు కట్టింగ్-ఎడ్జ్ హెడ్-వర్న్ ఏఆర్ ని సాధ్యసాధ్యాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.