హైలైట్స్:
- OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్, 120హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న OnePlus 11 Pro
- OnePlus 11 Pro 2023 ప్రథమార్థంలో లాంచ్ అవుతుందని అంచనా
టిప్ స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ ద్వారా OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. వన్ ప్లస్ నుంచి రాబోవు ఈ ఫ్లాగ్షిప్, స్మార్ట్‌ప్రిక్స్ షేర్ చేసిన రెండర్స్ వల్లన కొన్ని రోజుల క్రితం వార్తల్లో నిలిచింది. రెండర్స్ ద్వారా OnePlus 11 Pro లో అలర్ట్ స్లైడర్ ఉంటుందని స్పష్టమైంది. ఇప్పుడు స్టీవ్, 91మొబైల్స్ తో OnePlus 11 Pro యొక్క చిప్సెట్, ఫాస్ట్ చార్జింగ్, అలర్ట్ స్లైడర్ తదితర స్పెసిఫికేషన్స్ ని పంచుకున్నాడు.
వన్ ప్లస్ సంస్థ ఈ ఏడాది, OnePlus 10 Pro, OnePlus 10T, OnePlus 10R మోడల్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు OnePlus 11 సిరీస్ ని వచ్చే ఏడాది లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు OnePlus 11 Pro గురించి మాకు తెలిసిన వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఓసారి వాటిపై కన్నేయండి.
OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్
- 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
- 16జిబి వరకు ర్యామ్
- 50ఎంపి + 48ఎంపి + 32ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
- 16ఎంపి సెల్ఫీ కెమెరా
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus 11 Pro లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయని టిప్ స్టర్ 91మొబైల్స్ తో తెలిపాడు. అలాగే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుంది. ఈ ఏడాది నవంబర్ లో క్వాల్కమ్ కంపెనీ తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ని లాంచ్ చేయబోతోంది. ఇక OnePlus 11 Pro టాప్ వేరియంట్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగి ఉండగా, బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుందని సమాచారం.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, OnePlus 11 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్లో కచ్చితంగా ఉంటుందని సమాచారం. గతంలో నెట్టింట్లో ప్రత్యక్షమైన OnePlus 11 Pro రెండర్స్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది.
OnePlus 11 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, హాజల్‌బ్లడ్ కెమెరాలు, డాల్బి అట్మాస్, 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉండనున్నాయి. OnePlus 11 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.
OnePlus 11 Pro లాంచ్ తేదీ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే 2023 ప్రథమార్థం లో ఫోన్ లాంచ్ అవుతుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.