
OnePlus సంస్థ ఫిబ్రవరి 7 న జరగబోవు క్లౌడ్ ఈవెంట్ లో OnePlus 11 5G, OnePlus Buds Pro 2 లను లాంచ్ చేయబోతోంది. అయితే వీటితో పాటు తన తొలి కీబోర్డ్, ఇంకా కొత్త OnePlus TV 65 Q2 Pro కూడా లాంచ్ అవుతున్నాయి. ఇక తాజాగా అమెజాన్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, అదే రోజున OnePlus 11R 5G కూడా లాంచ్ అవుతుందట. ఈమేరకు అమెజాన్ ఇండియా తన ప్లాట్ఫామ్ పై OnePlus 11R 5G కి సంబంధించిన లాంచ్ వివరాలను పొందుపరిచింది.
భారత్ లో OnePlus 11R 5G లాంచ్ తేదీ
పైన ఇమేజ్ లో కనిపించిన దాన్ని బట్టి, OnePlus 11R 5G ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అమెజాన్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ పొరబాటున ప్రత్యక్షమైందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పోస్టర్ లో ది షేప్ ఆఫ్ పవర్ అని కొటేషన్ కూడా కనిపిస్తోంది. ఇంత వివరంగా ఉందంటే, అది పొరబాటని చెప్పలేం.
ఇప్పటికే వన్‌ప్లస్ కంపెనీ తాను 4 డివైజెస్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే OnePlus 11R 5G కి సంబంధించి మాత్రం ఇంతవరకు ప్రకటన చేయలేదు. ఇప్పటివరకు కేవలం లిస్టింగ్స్, లీక్స్, రూమర్ల ద్వారా మాత్రమే OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
OnePlus 11R 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉంటాయని సమాచారం. ఇక OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇప్పుడు OnePlus 11R 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని అంచనా.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












