Home News Snapdragon 8+ Gen 1 చిప్, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11R

Snapdragon 8+ Gen 1 చిప్, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11R

Highlights
  • భారత్ లో లాంచైన OnePlus 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • OnePlus 11 5G తో పాటు లాంచైన OnePlus 11R 5G
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 50ఎంపి సోని ఐఎంఎక్స్890 కెమెరా సెన్సర్, 16జిబి ర్యామ్ తో లాంచైన OnePlus 11 5G

OnePlus లవర్స్ ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. నేడు భారత్ లో OnePlus 11 5G, OnePlus 11R 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. వన్ ప్లస్ డివైజెస్ కి భారత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాప్ బ్రాండ్స్ లో ఒకటిగా వన్‌ప్లస్ బ్రాండ్ చేరిపోయింది. నేడు OnePlus 11 5G, OnePlus 11R 5G లతో పాటు వన్ ప్లస్ టీవీ తదితర డివైజెస్ కూడా లాంచ్ అయ్యాయి.

OnePlus 11R 5G డిజైన్ దాదాపుగా OnePlus 11 5G ని పోలి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. వన్‌ప్లస్ బ్రాండ్ బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో ఉంది. OnePlus 11R 5G డివైజ్ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్ + ర్యామ్ వీటా టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 11R 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OnePlus 11R 5G లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర, లభ్యత

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. రూ.6,000 ఎక్స్‌చేంజ్ బోనస్ ని వన్‌ప్లస్ అందిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి OnePlus 11R 5G ఓపెన్ సేల్ మొదలవుతుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్ సైట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.