
OnePlus సంస్థ తన కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus 11R 5G Solar Red ఎడిషన్ ని లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న OnePlus 11R కి స్పెషల్ వేరియంట్ గా వచ్చింది. OnePlus 11R సోలార్ రెడ్ ఎడిషన్ ప్రీమియమ్ బ్యాక్ ప్యానెల్ ఫినిష్, అత్యధిక ర్యామ్, వివిధ స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చింది. సరే, ఓసారి OnePlus 11R సోలార్ రెడ్ వేరియంట్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OnePlus 11R 5G Solar Red ధర, లభ్యత
OnePlus 11R 5G Solar Red సేల్ అక్టోబర్ 7 వ తేదీన రాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ఇండియా మరియు వన్‌ప్లస్ స్టోర్ ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు. OnePlus 11R 5G Solar Red ధర వివరాలు తెలియాలంటే ఫస్ట్ సేల్ వరకు ఆగాల్సిందే.
OnePlus 11R 5G Solar Red స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
OnePlus 11R 5G Solar Red డివైజ్ డిస్టింక్టివ్ లుక్, బ్యాక్ ప్యానెల్ ఫినిష్ తో వచ్చింది. OnePlus 11R స్టాండర్డ్ వేరియంట్ కంటే OnePlus 11R 5G Solar Red స్పెషల్ గా నిలుస్తోంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చింది. క్లాసిక్ శాండ్‌స్టోన్-లైక్ హ్యాండ్-ఫీల్, కంఫర్టబుల్ గ్రిప్ ఈ ఫోన్ కలిగి ఉంది.
కేవలం లుక్ మాత్రమే కాదు, OnePlus 11R 5G Solar Red డివైజ్ 18జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో రావడం విశేషం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్ వేరియంట్ లో గరిష్టంగా 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్-వీటా టెక్నాలజీతో ద్వారా మెమొరీని పెంచుకునే ఆప్షన్ స్టాండర్డ్ మరియు స్పెషల్ ఎడిషన్ లో అందుబాటులో ఉంది.
OnePlus 11R 5G Solar Red స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OnePlus 11R 5G Solar Red స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
- చిప్సెట్: OnePlus 11R 5G Solar Red లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.
- బ్యాటరీ: OnePlus 11R 5G Solar Red లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
- మెమొరీ: OnePlus 11R 5G Solar Red లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
- ఓఎస్: OnePlus 11R 5G Solar Red ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OnePlus 11R 5G Solar Red లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- కనెక్టివిటీ: OnePlus 11R 5G Solar Red లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- చుట్టుకొలత, బరువు: OnePlus 11R 5G Solar Red డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: OnePlus 11R 5G Solar Red లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.











