Home News 18GB ర్యామ్, 512GB స్టోరేజీతో భారత్ లో లాంచైన OnePlus 11R Solar Red ఎడిషన్

18GB ర్యామ్, 512GB స్టోరేజీతో భారత్ లో లాంచైన OnePlus 11R Solar Red ఎడిషన్

Highlights
  • భారత్ లో విడుదలైన OnePlus 11R సోలార్ రెడ్ కలర్ వేరియంట్
  • 100W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • ర్యామ్-వీటా టెక్నాలజీ ద్వారా ఒకేసారి రన్ కానున్న 50 యాప్స్‌

OnePlus సంస్థ తన కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus 11R 5G Solar Red ఎడిషన్ ని లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న OnePlus 11R కి స్పెషల్ వేరియంట్ గా వచ్చింది. OnePlus 11R సోలార్ రెడ్ ఎడిషన్ ప్రీమియమ్ బ్యాక్ ప్యానెల్ ఫినిష్, అత్యధిక ర్యామ్, వివిధ స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చింది. సరే, ఓసారి OnePlus 11R సోలార్ రెడ్ వేరియంట్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 11R 5G Solar Red ధర, లభ్యత

OnePlus 11R 5G Solar Red సేల్ అక్టోబర్ 7 వ తేదీన రాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ఇండియా మరియు వన్‌ప్లస్ స్టోర్ ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు. OnePlus 11R 5G Solar Red ధర వివరాలు తెలియాలంటే ఫస్ట్ సేల్ వరకు ఆగాల్సిందే.

OnePlus 11R 5G Solar Red స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus 11R 5G Solar Red డివైజ్ డిస్టింక్టివ్ లుక్, బ్యాక్ ప్యానెల్ ఫినిష్ తో వచ్చింది. OnePlus 11R స్టాండర్డ్ వేరియంట్ కంటే OnePlus 11R 5G Solar Red స్పెషల్ గా నిలుస్తోంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చింది. క్లాసిక్ శాండ్‌స్టోన్-లైక్ హ్యాండ్-ఫీల్, కంఫర్టబుల్ గ్రిప్ ఈ ఫోన్ కలిగి ఉంది.

కేవలం లుక్ మాత్రమే కాదు, OnePlus 11R 5G Solar Red డివైజ్ 18జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో రావడం విశేషం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్ వేరియంట్ లో గరిష్టంగా 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్-వీటా టెక్నాలజీతో ద్వారా మెమొరీని పెంచుకునే ఆప్షన్ స్టాండర్డ్ మరియు స్పెషల్ ఎడిషన్ లో అందుబాటులో ఉంది.

OnePlus 11R 5G Solar Red స్పెసిఫికేషన్స్