ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఫిబ్రవరి 7 న జరగబోవు Cloud 11 లాంచ్ ఈవెంట్ కి సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ లో వన్ ప్లస్ సంస్థ OnePlus 11 5G, OnePlus 11R 5G, OnePlus TV 65 Q2 Pro, OnePlus Buds 2 Pro ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్, అలాగే OnePlus Pad లను లాంచ్ చేయబోతోంది.
OnePlus 11 5G తో పాటు OnePlus 11R కూడా లాంచ్ అవుతోందని వన్ ప్లస్ సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. అలాగే OnePlus 11R క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టం చేసింది. OnePlus 11R యొక్క చిప్సెట్ ఫీచర్ ని ట్విట్టర్ ద్వారా OnePlus సంస్థ షేర్ చేసింది.
అయితే OnePlus 11R కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ని వన్ ప్లస్ రివీల్ చేయలేదు. ఇప్పటికే మేం గత కథనాల ద్వారా OnePlus 11R కి యొక్క వివరాలు తెలపడం జరిగింది. మరొకసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
The next generation of power is here. It's time to get ready for a new way to experience the #ShapeofPower with the all-new #OnePlus11R 5G.
— OnePlus India (@OnePlus_IN) January 27, 2023
OnePlus 11R 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
- 16జిబి వరకు ర్యామ్
- 256జిబి వరకు స్టోరేజీ
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
OnePlus 11R స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. ఇక చిప్సెట్ విషయానికి వస్తే, ఇందులో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని వాడినట్లు కంపెనీ అధికారికంగా స్పష్టం చేసింది. ఇకపోతే 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.
OnePlus 11R యొక్క కెమెరా విభాగం గురించి చూద్దాం. OnePlus 11R ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అంచనా. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉండనున్నాయి. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉంటుంది. OnePlus 11R ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
OnePlus 11R లో అలర్ట్ స్లైడర్, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ 5జీ, 4జీ, వొల్టీ, ఎన్ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
