Home News లాంచ్ కి ముందు లీకైన OnePlus 11R ఫస్ట్ లుక్

లాంచ్ కి ముందు లీకైన OnePlus 11R ఫస్ట్ లుక్

హైలైట్స్

OnePlus 11R యొక్క రీసెంట్ లీక్స్ ద్వారా ఈ ఫోన్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఫోన్ వన్ ప్లస్ 10టీ కి సక్సెసర్ గా వస్తుందని చెబుతున్నారు. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ సౌజన్యంతో GadgetGang తాజాగా OnePlus 11R యొక్క లైవ్ ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది. చూస్తుంటే OnePlus 11R ఫోన్ ఒప్పో రెనో 9 ప్రో+ ని పోలి ఉన్నట్లు అనిపిస్తోంది. రియర్ కెమెరా లే ఔట్ చూస్తే అచ్చంగా రెనో 9 ప్రో+ మాదిరి ఉంది.

OnePlus 11R కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్నట్లు సమాచారం. ఆర్-లైనప్ లో కర్వ్డ్ డిస్ప్లే అంటే ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

OnePlus 11R డిజైన్ (లీక్డ్)

OnePlus 11R స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. న్యారో బెజెల్స్ అన్ని కార్నర్స్ లో ఉన్నాయి. ఫోన్ వెనకాల చూస్తే, స్క్వేర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే వన్ ప్లస్ లోగో ని కూడా మనం బ్యాక్ ప్యానెల్ పై గమనించవచ్చు.

OnePlus 11R లో ఐఆర్ బ్లాస్టర్, మైక్రోఫోన్ తో వస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్ ట్రే సెక్షన్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి. పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. ఇక వాల్యూమ్ రాకర్ ఎడమ వైపున ఉంది.

OnePlus 11R స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OnePlus 11R లో 1.5 కే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, హై-పీడబ్ల్యూఎం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

OnePlus 11R యొక్క కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 13ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లేదా డెప్త్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అలర్ట్ స్లైడర్ కూడా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.