హైలైట్స్
- ఏప్రిల్ లేదా మే నెలలో భారత్ లో లాంచ్ కానున్న OnePlus 11R
- భారత్ లో ప్రారంభమైన OnePlus 11R స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి
- ఇప్పటికే లీకైన OnePlus 11R స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్
OnePlus 11R స్మార్ట్ ఫోన్ భారత్ లో ఏప్రిల్ లేదా మే నెలలో లాంచ్ కానుంది. ఇప్పటికే దేశంలో ఈ ఫోన్ యొక్క తయారీ మొదలైంది. ఈ విషయం ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా 91మొబైల్స్ తెలుసుకుంది. ఫిబ్రవరి లో గ్లోబల్ గా లాంచ్ కాబోయే OnePlus 11 తర్వాత వస్తోన్న రెండో ఫోన్ గా OnePlus 11R మార్కెట్ లోకి రానుంది. OnePlus 10R మాదిరిగా OnePlus 11R కూడా కాస్త డౌన్‌గ్రేడ్ స్పెసిఫికేషన్స్ తో రానుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో OnePlus 11R యొక్క పేరుని మేం గుర్తించాం. దీంతో భారత్ లో OnePlus 11R లాంచ్ పై స్పష్టత వచ్చినట్లైంది.
OnePlus 11R ఇండియా లాంచ్ టైమ్‌లైన్
భారత్ లో OnePlus 11R తయారీ మొదలైంది. టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం, వన్ ప్లస్ సంస్థ ఏప్రిల్ లేదా మే నెలలో OnePlus 11R ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. కొన్ని వారాల్లో OnePlus 11R యొక్క లాంచ్ పై పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతం వన్ ప్లస్ కంపెనీ ఫోకస్ OnePlus 11 ఫోన్ ని భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేయడంపై ఉంది.
OnePlus కంపెనీ అధికార వెబ్ సైట్ పై కనిపించిన OnePlus 11R పేరు
వన్‌ప్లస్ ఇండియా అధికార వెబ్‌సైట్ లో OnePlus 11R పేరు కనిపించింది. దీంతో భారత్ లో ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని స్పష్టమైంది. ఈ పేరు తప్పితే మరే ఇతర విషయం కూడా బయటకు రాలేదు. అయితే ఇప్పటికే OnePlus 11R యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. దీంతో ఇంకా ఊహించడానికి ఏమీ మిగలలేదు. సరే, ఓసారి OnePlus 11R యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
OnePlus 11R స్పెసిఫికేషన్స్ (రూమర్డ్)
కొన్ని వారాల క్రితం, Pricebaba వెబ్‌సైట్ OnePlus 11R యొక్క స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. ఫోన్ లోని అబౌట్ సెక్షన్ ఇమేజెస్ ఆధారంగా ఈ వివరాలను ప్రైస్ బాబా బయటపెట్టింది. OnePlus 11R ఫోన్ సీపీహెచ్2487 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 అండర్‌క్లాక్డ్ వర్షన్ (3.2గిగాహెర్ట్జ్ బదులుగా 3గిగాహెర్ట్జ్) తో రానుంది.
OnePlus 11R స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని కలిగి ఉంటుంది. 8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
ఇప్పుడు OnePlus 11R యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇక పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో OnePlus 11R వస్తున్నట్లు తెలుస్తోంది.
OnePlus 11R యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో అలర్ట్ స్లైడర్, ఐఆర్ బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. లీకైన లైవ్ ఇమేజెస్ ని బట్టి, ఫోన్ లో అలర్ట్ స్లైడర్, సెంటర్డ్ పంచ్ హోల్ డిస్ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయని స్పష్టమైంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












