Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న OnePlus 11R

Highlights

  • ఫిబ్రవరి 7 న OnePlus 11 తో పాటు భారత్ లో లాంచ్ కానున్న OnePlus 11R
  • OnePlus Ace 2 పేరుతో చైనాలో లాంచైన OnePlus 11R డివైజ్
  • 16జిబి ర్యామ్, సోని ఐఎంఎక్స్890 సెన్సర్ తో వస్తోన్న OnePlus 11R

OnePlus 11R స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. OnePlus 10R ఫోన్ కి సక్సెసర్ గా OnePlus 11R మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది OnePlus 10R ఇండియాలో లాంచైంది. OnePlus 11R డివైజ్ చైనాలో OnePlus Ace 2 పేరుతో అందుబాటులోకి రానుంది. తన వీబో హ్యాండిల్ పై వన్‌ప్లస్ సంస్థ OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని టీజ్ చేస్తోంది. లేటెస్ట్ టీజర్ ద్వారా కెమెరా స్పెసిఫికేషన్స్ ఖరారైయ్యాయి.

OnePlus 11R డివైజ్ సోని ఐఎంఎక్స్890 50ఎంపి మెయిన్ సెన్సర్ తో వస్తోంది. OnePlus 11 లో కూడా ఇదే సెన్సర్ వాడారు. ఇప్పుడు OnePlus 11R కూడా RAW ఫోటో షూటింగ్ మోడ్స్ ని ఆఫర్ చేయనుంది.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 16జిబి వరకు ర్యామ్
  • 256జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

OnePlus 11R స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. ఇక చిప్సెట్ విషయానికి వస్తే, ఇందులో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని వాడినట్లు కంపెనీ అధికారికంగా స్పష్టం చేసింది. ఇకపోతే 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

OnePlus 11R లో అలర్ట్ స్లైడర్, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ 5జీ, 4జీ, వొల్టీ, ఎన్ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

OnePlus 11R యొక్క కెమెరా విభాగం గురించి చూద్దాం. OnePlus 11R ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అంచనా. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉండనున్నాయి. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉంటుంది. OnePlus 11R ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

OnePlus 11R, OnePlus 11 స్మార్ట్ ఫోన్లు ఫిబ్రవరి 7 న అంటే రేపు భారత్ లో లాంచ్ అవుతున్నాయి. అఫీషియల్ లాంచ్ తర్వాత ధర, వేరియంట్స్, లభ్యత తదితర వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article108MP Samsung ISOCELL HM2 సెన్సర్, Snapdragon 778G చిప్‌తో లాంచైన POCO X5 Pro
Next articleSnapdragon 695 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన POCO X5 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.