
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus జనవరి 23న భారత్ లో OnePlus 12 మరియు OnePlus 12R ఫోన్లను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ అభిమానులు ఈ డివైజెస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అమెజాన్ చేసిన పొరబాటు వల్లన OnePlus 12 యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి OnePlus 12 లీకైన ధర వివరాలు, డివైజ్ స్పెసిఫికేషన్స్ ఓసారి తెలుసుకుందాం పదండి.
OnePlus 12 ఇండియా ధర (లీక్)
ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ చేసిన పొరబాటు వల్లన OnePlus 12 ధర రివీల్ అయ్యింది. అమెజాన్ వెబ్‌సైట్ లో OnePlus 12 డివైజ్ ప్రొడక్ట్ పేజీ ద్వారా లాంచ్ కంటే ముందే ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. OnePlus 12 డివైజ్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది.
OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లిస్టింగ్ లో ఫ్లోయీ ఎమరాల్డ్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది. అయితే అమెజాన్ తన పొరబాటుని వెంటనే సరిచేసుకుంది. పేజీలో వివరాలను తొలగించింది. అయితే ఈలోపే టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ స్క్రీన్‌షాట్ తీసి ఇంటర్నెట్ లో షేర్ చేశారు. దీంతో సమాచారం అందరికీ చేరిపోయింది.
OnePlus 12 స్పెసిఫికేషన్స్ (చైనా)
- డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.












