Home News OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12 12జిబి+256జిబి వేరియంట్ ధర

OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12 12జిబి+256జిబి వేరియంట్ ధర

Highlights
  • జనవరి 23న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 12
  • Amazon చేసిన పొరబాటుతో లీకైన ధర
  • OnePlus 12 12జిబి+256జిబి ధర రూ.69,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus జనవరి 23న భారత్ లో OnePlus 12 మరియు OnePlus 12R ఫోన్లను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ అభిమానులు ఈ డివైజెస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అమెజాన్ చేసిన పొరబాటు వల్లన OnePlus 12 యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి OnePlus 12 లీకైన ధర వివరాలు, డివైజ్ స్పెసిఫికేషన్స్ ఓసారి తెలుసుకుందాం పదండి.

OnePlus 12 ఇండియా ధర (లీక్)

ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ చేసిన పొరబాటు వల్లన OnePlus 12 ధర రివీల్ అయ్యింది. అమెజాన్ వెబ్‌సైట్ లో OnePlus 12 డివైజ్ ప్రొడక్ట్ పేజీ ద్వారా లాంచ్ కంటే ముందే ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. OnePlus 12 డివైజ్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది.

OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లిస్టింగ్ లో ఫ్లోయీ ఎమరాల్డ్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది. అయితే అమెజాన్ తన పొరబాటుని వెంటనే సరిచేసుకుంది. పేజీలో వివరాలను తొలగించింది. అయితే ఈలోపే టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ స్క్రీన్‌షాట్ తీసి ఇంటర్నెట్ లో షేర్ చేశారు. దీంతో సమాచారం అందరికీ చేరిపోయింది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (చైనా)