ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus 12 డివైజ్ ని లాంచ్ చేయనుంది. డిసెంబర్ 4 వ తేదీన OnePlus 12 స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో ద్వారా వన్ప్లస్ సంస్థ OnePlus 12 యొక్క లాంచ్ తేదీని షేర్ చేసింది. OnePlus 12 స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, బీఓఈ ఎక్స్1 ఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 2కే రెజుల్యూషన్ తో వస్తోంది.
OnePlus 12 లాంచ్ తేదీ
- OnePlus సంస్థ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో ద్వారా OnePlus 12 లాంచ్ తేదీని రివీల్ చేసింది.
- OnePlus 12 స్మార్ట్ఫోన్ డిసెంబర్ 4 వ తేదీన లాంచ్ అవుతోంది.
- డిసెంబర్ 4 న వన్ప్లస్ 10వ వార్షికోత్సవ సమావేశం జరగనుందని వన్ప్లస్ సంస్థ ప్రకటించింది.
- వన్ప్లస్ 10 వ యానివర్శరీ సెలబ్రేషన్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.
- OnePlus సంస్థ డివైజ్ యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను కూడా షేర్ చేసింది.
- OnePlus 12 డివైజ్ ప్రోఎక్స్డీఆర్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 2,600 నిట్స్ బ్రైట్నెస్, డిస్ప్లేమేట్ ఏ+ సర్టిఫికేషన్ తో వస్తోందని కంపెనీ వెల్లడించింది.
- OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 తో వస్తోంది.
OnePlus 12 స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ బీఓఈ ఎక్స్1 ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
- కెమెరా: OnePlus 12 లో 50ఎంపి సోని ఎల్వైటీఐఏ ఎల్వైటీ808 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 48ఎంపి ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- కనెక్టివిటీ: OnePlus 12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: OnePlus 12 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
