ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus చైనాలో డిసెంబర్ 4 వ తేదీన లాంచ్ చేస్తోంది. ఇదే రోజున OnePlus సంస్థ పదేళ్ళను పూర్తి చేసుకుంటుంది. కొన్ని రోజుల క్రితమే OnePlus 12 లాంచ్ తేదీని వన్‌ప్లస్ సంస్థ ప్రకటించింది. ఇక గ్లోబల్ మార్కెట్ లో 2024 జనవరిలో OnePlus 12 లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ వివిధ సర్టిఫికేషన్స్ ని పొందింది. తాజాగా వన్‌ప్లస్ కంపెనీ OnePlus 12 యొక్క కలర్ ఆప్షన్స్ రివీల్ చేసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
OnePlus 12 కలర్ ఆప్షన్స్
OnePlus 12 గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తోన్న వన్‌ప్లస్ ఇప్పుడు కొత్త టీజర్ ని నెట్టింట్లో వదిలింది. OnePlus చైనా ప్రెసిడెంట్ లీ జీ OnePlus 12 కొత్త టీజర్ ని షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన టీజర్ ప్రకారం.. OnePlus 12 వైట్, పేల్ గ్రీన్, రాక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది.
OnePlus 12 స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 2కే డిస్ప్లే, 2,600 నిట్స్ బ్రైట్నెస్, Sony LYTIA LYT808 ప్రైమరీ రియర్ కెమెరా సెన్సర్, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
OnePlus 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ బీఓఈ ఎక్స్1 ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
- కెమెరా: OnePlus 12 లో 50ఎంపి సోని ఎల్వైటీఐఏ ఎల్వైటీ808 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 48ఎంపి ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- కనెక్టివిటీ: OnePlus 12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: OnePlus 12 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
