
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ను లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ ధర అందుబాటులోకి వస్తోంది. తాజాగా OnePlus 12 రూ.9,000 చవకగా లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.7,999 ఉచితంగా అందిస్తోంది. మీరు గనుక, ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని భావిస్తుంటే ఇది మంచి డీల్ అవుతుంది. సరే, ఓసారి OnePlus 12 యొక్క ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
OnePlus 12 5G ఆఫర్లు మరియు ధర (కంపెనీ వెబ్‌సైట్)
కంపెనీ వెబ్‌సైట్ లో OnePlus 12 5G మీద రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ మరియు రూ.7,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తున్నాయి. దీంతో డివైజ్‌ను రూ.55,999 కే కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, వన్‌కార్డ్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు.
OnePlus 12 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి కంపెనీ రూ.7,999 విలువ గల Buds Pro 2 ని ఉచితంగా అందిస్తోంది.
ఇంకా 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
లాంచ్ సమయంలో, OnePlus 12 5G 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.64,999 మరియు 16జిబి+512జిబి మోడల్ ధర రూ.69,999 గా ఉన్నాయి.
OnePlus 12 5G డివైజ్ సిల్కీ బ్లాక్, ఫ్లోయీ ఎమరాల్డ్ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus 12 5G ఆఫర్లు మరియు ధర (అమెజాన్)
OnePlus 12 5G స్మార్ట్‌ఫోన్ పై ప్రస్తుతం రూ.2,000 ఫ్లాట్ కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు, కస్టమర్లకు రూ.6,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు కలిపితే, మొత్తం మీద రూ.8,000 కస్టమర్లకు ప్రయోజనం కల్గుతుంది.
కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ కలిపుకుంటే, OnePlus 12 5G ని రూ.56,998 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఆఫర్లతో పాటు, కంపెనీ ఈ ఫోన్ కొనేవారికి రూ.7,999 విలువగల OnePlus Buds Pro 2 ఇయర్ బడ్స్‌ను ఉచితంగా అందిస్తోంది.
పూర్తి పేమెంట్ ఒకేసారి చెల్లించలేకపోతే, మీకు 3 నెలల నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
OnePlus 12 5G పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా రూ.36,400 వరకు బెనిఫిట్ పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
OnePlus 12 5G స్పెసిఫికేషన్స్
స్క్రీన్: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్రోఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్య్లూఎమ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా పిక్సెల్స్‌వర్క్స్ ఎక్స్7 ఇండిపెండెంట్ విజువల్ చిప్ కూడా ఉంది.
ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 గ్లేసియల్ వైట్ వేరియంట్ 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.
కెమెరా: OnePlus 12 గ్లేసియల్ వైట్ మోడల్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3ఎక్స్ టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
కనెక్టివిటీ: OnePlus 12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.












