ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో గ్లోబల్ గా OnePlus 12 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి OnePlus 12 ఫోన్ స్పెసిఫికేషన్స్ మరియు గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.
Geekbench పై కనిపించిన OnePlus 12
- CPH2581 అనే మోడల్ నంబర్ తో గీక్బెంచ్ పై కనిపించిన OnePlus 12
- సింగిల్-కోర్ టెస్ట్ లో 2,169 స్కోర్, మల్టీ-కోర్ టెస్ట్ లో 6,501 స్కోర్ నమోదు చేసిన OnePlus 12
- లిస్టింగ్ ప్రకారం, OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ మరియు 16జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలుస్తోంది.
- మదర్బోర్డ్ సెక్షన్ లో పైనాపిల్ అనే కోడ్ నేమ్ మెన్షన్ చేసి ఉంది. అంటే ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ అని భావిస్తున్నారు.
- ఈ చిప్సెట్ 3.30 గిగాహెర్ట్జ్ పీక్ క్లాక్ స్పీడ్ కలిగి ఉన్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- గతంలో ఈఈసీ సర్టిఫికేషన్ పై OnePlus 12 కనిపించింది. ఈ లిస్టింగ్ లో సేమ్ మోడల్ నంబర్ మరియు మానుఫాక్చరర్ బ్రాండ్ ‘వన్ప్లస్’ అని పేర్కొనబడి ఉన్నాయి.
OnePlus 12 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OnePlus 12 లో 2కే ఎల్టీపీవో బీఓఈ ఎక్స్1 ఓఎల్ఈడీ స్క్రీన్, ఒప్పో పీ1 డిస్ప్లే చిప్, బీఓఈ సింగిల్-పిక్సెల్ కాలిబ్రేటింగ్ టెక్నాలజీ, 6.82-ఇంచ్ స్క్రీన్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ ఉంటుంది.
- మెమొరీ: OnePlus 12 డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది.
- ఓఎస్: OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్966 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 3x పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీ కెమెరా వివరాలు ఇంకా తెలియలేదు.
- బ్యాటరీ: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ లో 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
