Home News OnePlus 12: భారత్‌లో లాంచైన వన్‌ప్లస్ 12 గ్లేసియల్ వైట్ కలర్ వేరియంట్

OnePlus 12: భారత్‌లో లాంచైన వన్‌ప్లస్ 12 గ్లేసియల్ వైట్ కలర్ వేరియంట్

Highlights
  • భారత్‌లో OnePlus 12 కొత్త కలర్ లాంచ్
  • గ్లేసియల్ వైట్ కలర్‌లో వచ్చిన డివైజ్
  • 12జిబి+256జిబి మోడల్ ధర రూ.64,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 12 గ్లేసియల్ వైట్ కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇంతకు ముందు ఈ ఫోన్ ఫ్లోయీ ఎమరాల్డ్ మరియు సిల్కీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన గ్లేసియల్ వైట్ కలర్ వేరియంట్ డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ విషయంలో ఇతర రెండు కలర్ మోడల్స్ మాదిరే ఉంటుంది. అయితే గ్లేసియల్ వైట్ గ్లాసీ ఫినిష్ తో వచ్చింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OnePlus 12 గ్లేసియల్ వైట్ ధర, లభ్యత

OnePlus 12 గ్లేసియల్ వైట్ ఎడిషన్ భారత్ లో సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధర ఎంతో తెలుసుకుందాం.

OnePlus 12 గ్లేసియల్ వైట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ ధరను రూ.64,999 గా నిర్ణయించారు.

OnePlus 12 గ్లేసియల్ వైట్ ఎడిషన్ అమెజాన్, వన్‌ప్లస్ ఈ-స్టోర్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా జూన్ 6 నుంచి విక్రయానికి వస్తోంది.

కొత్త కలర్ వేరియంట్ పై ఎంపిక చేయబడిన బ్యాంక్స్ లావాదేవీలపై రూ.3,000 డిస్కౌంట్‌ను వన్‌ప్లస్ ఆఫర్ చేస్తోంది.

జూన్ 20 లోపు ఫోన్ కొనే వారికి రూ.2,000 కూపన్ కూడా లభిస్తుంది. కంపెనీ ఇంకా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.12,000 మరియు 12 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది.

OnePlus 12 గ్లేసియల్ వైట్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్రోఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్య్లూఎమ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా పిక్సెల్స్‌వర్క్స్ ఎక్స్7 ఇండిపెండెంట్ విజువల్ చిప్ కూడా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 గ్లేసియల్ వైట్ వేరియంట్ 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: OnePlus 12 గ్లేసియల్ వైట్ మోడల్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3ఎక్స్ టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కనెక్టివిటీ: OnePlus 12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.