ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus చైనాలో OnePlus 12 స్మార్ట్ఫోన్ ని లాంచ్ చేసింది. OnePlus 11 కి సక్సెసర్ గా OnePlus 12 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2024 జనవరి లో OnePlus 12 భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. గత మోడల్ OnePlus 11 తో పోల్చితే OnePlus 12 లో ఎన్నో అప్గ్రేడ్స్ ఉన్నాయి. సరే, OnePlus 12 కి సంబంధించి ఆ విశేషాలతో పాటు, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
OnePlus 12 డిజైన్
- OnePlus 12 డివైజ్ లో అప్డేటెడ్ హాజల్బ్లడ్ ఫోర్త్ జనరేషన్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. కెమెరా ప్యానెల్ భారీగా కాస్త పైకి ఉబికి కనిపిస్తోంది.
- OnePlus 12 లో పంచ్ హోల్ కటౌట్ డిజైన్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి.
- ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఉన్నాయి. మరోవైపున గేమింగ్ యాంటిన్నా ఉంది.
- OnePlus 12 కి బాటమ్ లో స్పీకర్ గ్రిల్, మైక్, యూఎస్బీ-పోర్ట్ ఉన్నాయి.
OnePlus 12 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OnePlus 12 ధర
- OnePlus 12 డివైజ్ 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- OnePlus 12 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4,299 యువాన్లు (సుమారు రూ.50,636)
- OnePlus 12 స్మార్ట్ఫోన్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 4,799 యువాన్లు (సుమారు రూ.56,525) గా ఉంది.
- OnePlus 12 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 5,299 యువాన్లు (సుమారు రూ.62,414) గా ఉంది.
- OnePlus 12 టాప్ మోడల్ 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధరను 5,799 యువాన్లు (సుమారు రూ.68,303) గా నిర్ణయించారు.
