
OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 12 ని కొత్త కలర్లో లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని వన్‌ప్లస్ బ్రాండ్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. అయితే కలర్ ఏంటో గెస్ చేస్తే ఆ కొత్త కతర్ వేరియంట్ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశాన్ని వన్‌ప్లస్ కల్పిస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OnePlus 12 కొత్త కలర్ ఆప్షన్ టీజర్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై వన్‌ప్లస్ సంస్థ OnePlus 12 కొత్త కలర్ వేరియంట్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
తన పోస్ట్ లో డివైజ్ బ్యాక్ సైడ్ ని వన్‌ప్లస్ రివీల్ చేసింది. అయితే దీనికి OnePlus 12 కొత్త కలర్ ఏంటనే ప్రశ్నను జత చేసింది. కలర్ గెస్ చేసే వారు కొత్త డివైజ్‌ని గెలుచుకోవచ్చు.
All might. Now in _____. Guess the all-new colour of the OnePlus 12 and stand a chance to win one!
Comment with #ASpectrumOfPower to participate.Stay tuned for more! pic.twitter.com/SJtQ1JYp9C
— OnePlus India (@OnePlus_IN) May 28, 2024
కంపెనీ పోస్ట్ కి రిప్లైగా మీరు గెస్ చేసే కలర్ ను టైప్ చేసి పోటీలో పాల్గొనవచ్చు.
చైనాలో లాంచైన గ్లేసియర్ వైట్ కలర్ మాదిరి ఈ ఫోన్ కలర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ కొత్త కలర్ వేరియంట్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ, రానున్న కొన్ని రోజుల్లో తేదీ ప్రకటన ఉంటుంది.
OnePlus 12 డివైజ్ కలర్, ధరలో మార్పు ఉంటుంది. కానీ, స్పెసిఫికేషన్స్ లో ఎటువంటి మార్పు ఉండదు.
OnePlus 12 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 3168*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2కే 120 హెర్ట్జ్ ప్రోఎక్స్డీఆర్ ఎల్టీపీవో+ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, హైపర్ రెండరింగ్+హైపర్ టచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 4,500 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి.
ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వచ్చింది.
ఓఎస్: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3x టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం OnePlus 12 లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇతర ఫీచర్లు: OnePlus 12 లో 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్సీ, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ క్రయో-వెలాసిటీ వీసీ కూలింగ్ సిస్టమ్, 3డీ స్పేషియల్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి.











