Home News లాంచ్‌కి ముందు లీకైన OPPO Find X7 Pro, OnePlus 12 డిస్ప్లే, చార్జింగ్ స్పెసిఫికేషన్స్!

లాంచ్‌కి ముందు లీకైన OPPO Find X7 Pro, OnePlus 12 డిస్ప్లే, చార్జింగ్ స్పెసిఫికేషన్స్!

Highlights
  • ఈ ఏడాది లాంచ్ కానున్న OPPO Find X7 Pro, OnePlus 12
  • 2k కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న రెండు డివైజెస్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వస్తోన్న OnePlus 12

ఈ ఏడాది ఏదైనా సమయంలో OPPO Find X7 Pro, OnePlus 12 డివైజెస్ లాంచ్ కానున్నాయని సమాచారం. అయితే లాంచ్ కి చాలా రోజుల ముందు ఈ రెండు ఫోన్లుక సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ప్రస్తుతం డిస్ప్లే మరియు చార్జింగ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందట. ఇందులో 50ఎంపి + 50ఎంపి + 64ఎంపి సెన్సర్స్ ఉంటాయని తెలుస్తోంది.  సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

కెమెరా: ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందట. ఇందులో 50ఎంపి + 50ఎంపి + 64ఎంపి సెన్సర్స్ ఉంటాయని తెలుస్తోంది.

చిప్సెట్: OnePlus 12 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ తో రానున్నట్లు సమాచారం.

డిస్ప్లే: OnePlus 12 డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.