లీకైన OnePlus 12 స్పెసిఫికేషన్స్; స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న డివైజ్!

Highlights

  • 2కే రెజుల్యూషన్ డిస్ప్లేతో వస్తోన్న OnePlus 12
  • 1టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేయనున్న డివైజ్
  • OnePlus 12 64ఎంపి 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ తో వచ్చే అవకాశం

OnePlus తన నంబర్ సిరీస్ లో త్వరలోనే OnePlus 12 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా దీని గురించి సమాచారం వస్తోంది. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OnePlus 12 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది. గతంలో కంటే ఎన్నో పవర్ఫుల్ అప్‌గ్రేడ్స్, స్టర్డీ అప్‌గ్రేడ్స్ తో OnePlus 12 వస్తుందని సమాచారం. సరే ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (లీక్)

OnePlus 12 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అక్టోబర్ నెలలో లాంచ్ కానుంది. ఇక OnePlus 12 డివైజ్ 24జిబి వరకు ర్యామ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కెమెరా విభాగం కూడా భారీ మెరుగులతో రానున్నట్లు సమాచారం.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12 లో 2కే రెజుల్యూషన్ గల డిస్ప్లే ఉంటుంది. అలాగే కర్వ్డ్ ఎడ్జ్, హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడనున్నారు.
  • స్టోరేజీ: OnePlus 12 లో 16జిబి మరియు 24జిబి ర్యామ్ ఆప్షన్స్ తో ఈ డివైజ్ రానుందని సమాచారం. 1టిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. దీనర్థం, 8జిబి లేదా 12జిబి ర్యామ్ ఆప్షన్స్ ఉండకపోవచ్చు.
  • కెమెరా: OnePlus 12 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్9 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12 లో మెటాలిక్ మిడ్-ఫ్రేమ్, ఎక్స్-యాక్సిస్ మోటర్ ఉంటాయి. అలాగే భారీ వేపర్ చాంబర్, ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
Previous articleDimensity 6100+ చిప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో లాంచైన Realme 11x 5G
Next articleభారత్‌లో లాంచైన Redmi A2+ 4GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.