ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus 12 సిరీస్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఈ సరికొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే లీక్స్ ద్వారా ఇప్పటికే OnePlus 12 సిరీస్ కి చెందిన ఎన్నో స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఈ ఆర్టికల్ లో OnePlus 12 సిరీస్ కి సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
OnePlus 12 లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కొన్ని రోజుల క్రితం OnePlus 12 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ చేశారు. పవర్ఫుల్ అప్‌గ్రేడ్స్ తో OnePlus 12 వస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ నెలలో లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. OnePlus 12 డివైజ్ 24జిబి ర్యామ్ సపోర్ట్ తో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
OnePlus 12 స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: OnePlus 12 లో 2కే రెజుల్యూషన్ గల డిస్ప్లే ఉంటుంది. అలాగే కర్వ్డ్ ఎడ్జ్, హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus 12 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడనున్నారు.
- స్టోరేజీ: OnePlus 12 లో 16జిబి మరియు 24జిబి ర్యామ్ ఆప్షన్స్ తో ఈ డివైజ్ రానుందని సమాచారం. 1టిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. దీనర్థం, 8జిబి లేదా 12జిబి ర్యామ్ ఆప్షన్స్ ఉండకపోవచ్చు.
- కెమెరా: OnePlus 12 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్9 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- ఇతర ఫీచర్లు: OnePlus 12 లో మెటాలిక్ మిడ్-ఫ్రేమ్, ఎక్స్-యాక్సిస్ మోటర్ ఉంటాయి. అలాగే భారీ వేపర్ చాంబర్, ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
