ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ OnePlus డిసెంబర్ ఆరంభంలో OnePlus 12 డివైజ్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు OnePlus 12R యొక్క లాంచ్ తేదీ కూడా ఖరారైంది. OnePlus 12 తో పాటే ఈ ఫోన్ భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. నేడు OnePlus కంపెనీ కొత్త టీజర్ ద్వారా OnePlus 12R డివైజ్ యొక్క కలర్ ఆప్షన్ మరియు లాంచ్ తేదీని వెల్లడించింది. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
OnePlus 12R లాంచ్ మరియు కలర్ ఆప్షన్స్ ఖరారు
- OnePlus 12R స్మార్ట్ఫోన్ యొక్క కలర్ ఆప్షన్ మరియు లాంచ్ తేదీని X ప్లాట్ఫామ్ మరియు అధికార వెబ్సైట్ ద్వారా కంపెనీ ఖరారు చేసింది.
- OnePlus 12R డివైజ్ గ్లోబల్ గా బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
- OnePlus 12R డివైజ్ భారతీయ మార్కెట్ లో మింగ్షా గోల్డ్ కలర్ ఆప్షన్ లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
- OnePlus 12 మరియు OnePlus 12R స్మార్ట్ఫోన్లు భారతీయ మార్కెట్ లో జనవరి 23 వ తేదీన రాత్రి 7.30 గంటలకు లాంచ్ అవుతాయి.
OnePlus 12R global variants will only get Black and Blue colors!
In India OnePlus may launch Mingsha Gold color later in 2024. #OnePlus12R pic.twitter.com/ynlOdkx0oC
— OnePlus Club (@OnePlusClub) December 27, 2023
OnePlus 12R స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus 12R లో 6.78-ఇంచ్ ఎక్స్డీఆర్ ఎల్టీపీవో 7.0 అమోలెడ్ డిస్ప్లే, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus 12R లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: OnePlus 12R లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
- బ్యాటరీ: OnePlus 12R లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OnePlus 12R డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OnePlus 12R లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, అలర్ట్ స్లైడర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
