
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 12 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో OnePlus 12 మరియు OnePlus 12R డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం OnePlus 12R గురించి తెలుసుకుందాం. OnePlus 12R స్మార్ట్‌ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OnePlus 12R పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.
OnePlus 12R ధర, లభ్యత
- OnePlus 12R స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఓసారి వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- OnePlus 12R 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.39,999 గా నిర్ణయించారు.
- OnePlus 12R 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.45,999 గా ఉంది.
- భారత్ లో OnePlus 12R సేల్ ఫిబ్రవరి 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.
- OnePlus 12R కొనుగోలుపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2,250 విలువగల ప్రయోజనాలతో పాటు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి.
- మొదటి 24 గంటల్లో OnePlus 12R ని ప్రీ-ఆర్డర్ చేసిన వారికి రూ.4,999 విలువగల Buds Z2 ని వన్‌ప్లస్ ఉచితంగా అందిస్తోంది.
- అలాగే OnePlus Pad కొనుగోలుపై రూ.3,000 డిస్కౌంట్ తో పాటు ఆర్సీసీ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది.
- OnePlus 12R కస్టమర్లకు గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ 6 నెలలు, యూట్యూబ్ ప్రీమియమ్ 3 నెలల కాలపరిమితితో లభించనుంది.
- OnePlus 12R స్మార్ట్‌ఫోన్ కూల్ బ్లూ మరియు ఐరన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OnePlus 12R స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OnePlus 12R లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
- ప్రాసెసర్: OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ అందించారు.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus 12R డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12R లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: OnePlus 12R లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- సాఫ్ట్వేర్: OnePlus 12R డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OnePlus 12R లో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్సీ, ఐపీ64, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.











