
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus తాజాగా భారతీయ మార్కెట్ లో OnePlus 12R యొక్క కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం సన్‌సెట్ డ్యూన్ కలర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న కూల్ బ్లూ మరియు ఐరన్ గ్రే కలర్స్ కి తోడు సన్‌సెట్ డ్యూన్ కలర్ వచ్చి చేరింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
OnePlus 12R ధర, సేల్
OnePlus 12R సన్‌సెట్ డ్యూన్ కలర్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.42,999 గా ఉంది. జులై 20వ తేదీ నుంచి అమెజాన్ మరియు వన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.5,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
OnePlus 12R సన్‌సెట్ డ్యూన్ కలర్ కొనుగోలు చేసే వారికి OnePlus Buds 3 ఇయర్ బడ్స్‌ని వన్‌ప్లస్ ఉచితంగా అందిస్తోంది. కస్టమర్లకు 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.
OnePlus 12R స్పెసిఫికేషన్స్
OnePlus 12R లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2780*1264 పిక్సెల్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10+, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ ఉపయోగించారు. ఈ ఫోన్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OnePlus 12R స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డాల్బీ అట్మాస్, ఎన్ఎఫ్‌సీ, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఎన్ఎఫ్‌సీ, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.











