Home News Oneplus 13: లీకైన వన్‌ప్లస్ 13 కెమెరా స్పెసిఫికేషన్స్

Oneplus 13: లీకైన వన్‌ప్లస్ 13 కెమెరా స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో Oneplus 13 లాంచ్
  • 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oneplus నుంచి త్వరలో ఫ్లాగ్షిప్ డివైజ్ Oneplus 13 లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించి బ్రాండ్ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఈలోపు Oneplus 13 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం.

Oneplus 13 కెమెరా స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Oneplus 13 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ Weibo పై టిప్‌స్టర్ ఈ వివరాలను షేర్ చేశారు.

లీక్ ప్రకారం, Oneplus 13 డివైజ్ సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, ఐఎంఎక్స్882 పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం.

ఈ ఫోన్ లో ఉండే కెమెరా సెటప్ లో అన్నీ 50ఎంపి సెన్సర్స్ ఉంటాయి. హాజల్‌బ్లడ్ కంపెనీచే ఈ సెన్సర్స్ ట్యూన్ చేయబడ్డాయి.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. అక్టోబర్ నెలలో ఈ ప్రాసెసర్ లాంచ్ కానుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus 13 డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తోంది.

బ్యాటరీ: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే స్క్రీన్, ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్రోఎక్స్‌డీఆర్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5400 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా, 5జీ, 4జీ వొల్టీ, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.