OnePlus: రెండర్ ఇమేజ్ ద్వారా రివీలైన OnePlus 13 డిజైన్

Highlights

  • త్వరలో OnePlus 13 లాంచ్
  • లీకైన మాకప్ రెండర్
  • 6.8-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్‌‌ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ కానుంది. OnePlus 13 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ యొక్క మాకప్ రెండర్ తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. ప్రస్తుతం ఉన్న OnePlus 12 సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో రాగా, OnePlus 13 స్క్విరికల్ కెమెరా మాడ్యూల్ తో రాబోతున్నట్లు రెండర్ ద్వారా రివీల్ అయ్యింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 13 మాకప్ రెండర్ (లీక్)

OnePlus డివైజ్ యొక్క మాకప్ రెండర్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై షేర్ అయ్యింది. ఇది OnePlus 13 అయ్యుంటుందని అందరూ భావిస్తున్నారు.

కొత్త రెండర్ ని గమనిస్తే, OnePlus 13 బ్యాక్ ప్యానెల్ పై స్క్విరికల్ కెమెరా ఐల్యాండ్ కనిపిస్తోంది.

కెమెరా మాడ్యూల్ లో 4 కటౌట్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి ఫ్లాష్ లైట్ కాగా, మిగతావి కెమెరా లెన్సెస్.

కెమెరా మాడ్యూల్ పై హాజల్‌బ్లడ్ బ్రాండింగ్ కూడా ఉంది. అలాగే ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంది.

ఫోన్ వెనుకవైపు నుంచి చూస్తే కాస్త కర్వ్డ్ గా కనిపిస్తోంది. కార్నర్స్ లో స్టెయిన్‌లెస్ స్టీల్ హింజ్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది మాక్ రెండర్ కావున బ్యాక్ ప్యానెల్ పై వన్‌ప్లస్ లోగో లేదు.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus 13 లో 6.8-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

OnePlus 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ తో వస్తోందని సమాచారం. ఈ చిప్సెట్ 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.0GHz.

OnePlus 12 లో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.39GHz.

2024 అక్టోబర్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ లాంచ్ అవుతుంది. అంటే ఫోన్ డిసెంబర్ లో లాంచ్ అవ్వవచ్చు.