Vivo: లీకైన Vivo X100s, X100s Pro, X100 Ultra ధరలు

Highlights

  • మే 13న Vivo X100s సిరీస్ లాంచ్
  • మీడియాటెక్ 9300 ప్లస్ చిప్సెట్
  • సిరీస్ ప్రారంభ ధర 3999 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో X100s సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవుతోంది. అక్కడ మే 13న ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ లైనప్ లో Vivo X100s, X100s Pro అనే రెండు ఫోన్లు రానున్నాయి. వీటితో పాటు Vivo X100 Ultra కూడా లాంచ్ కాబోతోంది. తాజాగా, ఈ మూడు ఫోన్ల యొక్క ధరలు, ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo X100s ధర (లీక్)

Vivo X100s 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4399 యువాన్లు (సుమారు రూ.50,900) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 4699 యువాన్లు (రూ.54,000) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 5199 యువాన్లు (సుమారు రూ.60,000) గా ఉంది.

ఒకవేళ ఈ లీక్ నిజమైతే, Vivo X100s చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది.

Vivo X100s Pro ధర (లీక్)

Vivo X100s Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4999 యువాన్లు (సుమారు రూ.57,900)

Vivo X100s Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 5599 యువాన్లు (సుమారు రూ.64,900)

Vivo X100s Pro 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 6199 యువాన్లు (సుమారు రూ.71,900)

Vivo X100 Ultra ధర (లీక్)

Vivo X100 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 6699 యువాన్లు (సుమారు రూ.77,500).

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 7499 యువాన్లు (సుమారు రూ.86,900).

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 8499 యువాన్లు (సుమారు రూ.98,000).

భారత్ లో Vivo X100 Ultra మరియు Vivo X100s సిరీస్ ధరలు చైనా మార్కెట్ కంటే తక్కువగా ఉంటాయని అంచనా వేయవచ్చు.

Vivo X100s సిరీస్ చిప్సెట్ వివరాలు

Vivo X100s సిరీస్ చిప్సెట్స్ వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. అయితే లీక్స్ ద్వారా డీటెయిల్స్ బయటకు వచ్చాయి. Vivo X100s మరియు Vivo X100s Pro ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. మే 7న ఈ చిప్సెట్ లాంచ్ అవుతోంది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4GHz. ఇమ్మోర్టాలిస్-జీ720 ఎంసీ12 జీపీయూ గ్రాఫిక్స్‌ని ఈ ఫోన్లలో వాడనున్నారు.